సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ramayana: 'రామాయణ్‌’పై ట్రోలింగ్‌ సద్గురు స్పందన..

ABN, Publish Date - Oct 30 , 2025 | 10:00 AM

బాలీవుడ్‌లో దర్శకుడు నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ‘రామాయణ’  (Ramayana)పేరుతో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై వస్తున్నా ట్రోలింగ్ గురించి  ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్‌ (Sadhguru) మాట్లాడారు.

Ramayana - Sadhguru

బాలీవుడ్‌లో దర్శకుడు నితీశ్‌ తివారీ (Nitesh Tiwari) రామాయణాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.  ‘రామాయణ’  (Ramayana)పేరుతో రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌, సీతగా సాయిపల్లవి నటిస్తున్నారు. నిమిత్‌ మల్హోత్ర రూ.4000 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో రాముడిగా బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ను హీరోగా ఎంపిక చేయడంలో మొదటి నుంచీ ట్రోల్స్‌ వస్తున్నాయి. దీనిపై తాజాగా ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గి వాసుదేవ్‌ (Sadhguru) మాట్లాడారు. చిత్ర నిర్మాత నమిత్‌ మల్హోత్రాకు సద్గురు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఈ వివాదంపై స్పందించారు.  



‘ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఓ యజ్ఞంలా పని చేస్తున్న సినిమాపై అలా నెగటివ్‌గా ట్రోల్‌ చేయడం తప్పు. గత చిత్రాల్లో రణ్‌బీర్‌ ఏవేవో పాత్రలు చేశాడు.. ఇప్పుడు రాముడిగా నటించడానికి వీల్లేదనడం అన్యాయమైన అవుతుంది. భవిష్యత్తులో రాముడి పాత్ర చేయాల్సి వస్తుందని అతడికి ముందుగా తెలియదు కదా.. రేపు ఇంకో సినిమాలో రావణుడిగా నటించవచ్చు.. అప్పుడూ అలాగే ట్రోల్స్‌ చేస్తారా?  అలా చేయడం సరైన పద్థతి కాదు’’ అని అన్నారు. అలాగే రావణుడిగా కనిపించనున్న యశ్‌ ఎంతో అందమైన, తెలివైన వ్యక్తి అని సద్దురు కొనియాడారు. ‘రామాయణ’లో బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ కూడా నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆయన తీసుకునే పారితోషికం మొత్తాన్ని క్యాన్సర్‌ బాధిత పిల్లల చికిత్స కోసం విరాళంగా ఇవ్వబోతున్నటు తాజాగా ఆయన వెల్లడించారు. ఈ చిత్రం చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పిన ఆయన ‘రామాయణ’తో భారతీయ చిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుందని చెప్పారు. ఇప్పటికే మొదటి భాగం షూటింగ్  పూర్తయిందని, ప్రస్తుతం  పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇందులో హనుమంతుడి పాత్రలో సన్నీదేవోల్‌ నటిస్తున్నారు. మొదటి పార్ట్‌ 2026 దీపావళికి, రెండో పార్టు  2027 దీపావళికి విడుదల కానున్నాయి.

Updated Date - Oct 30 , 2025 | 11:53 AM