Operation Sindoor: భారతీయ సినిమాలో మీరు.. మాకు సిగ్గుచేటు

ABN , Publish Date - May 09 , 2025 | 03:01 PM

భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ (Fawad Khan) చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) ఖండించారు.


పహల్గాం దాడులకు ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్‌ చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై (Operation Sindoor) పాకిస్థాన్‌ నటుడు ఫవాద్‌ ఖాన్‌ (Fawad Khan) చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటి రూపాలీ గంగూలీ (Rupali Ganguly) ఖండించారు. సోషల్‌ మీడియా వేదికగా ఫవాద్‌ను విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘‘మీలాంటి వాళ్లు భారతీయ సినిమాల్లో పనిచేయడం మాకు సిగ్గుచేటు’’ అని అతని ఫొటో షేర్‌ చేశారు. ఈ పోస్ట్‌కు ఆపరేషన్‌ సిందూర్‌, ఇండియన్‌ ఆర్మీ, ఇండఇయన్‌ ఎయిర్‌ఫోర్స్‌ హ్యాష్‌ ట్యాగ్‌ను ఆమె జోడించారు.

‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పాకిస్థానీ నటీనటులు ఫవాద్‌ఖాన్‌, మహిరా ఖాన్‌ చేసిన వ్యాఖ్యలను ఆల్‌ ఇండియా సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌ కూడా ఖండించింది. చిత్ర పరిశ్రమ నుంచి వారిని తక్షణమే బహిష్కరించాలని పిలుపునిచ్చింది. కళల పేరుతో ఇలాంటి వారికి గుడ్డిగా మద్దతు ఇవ్వొద్దని చిత్ర పరిశ్రమను అసోసియేషన్‌ కోరింది. పహల్గాంలో దాడి జరిగిన తర్వాత ఫవాద్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘అబీర్‌ గులాల్‌’ సినిమాను భారత్‌లో  బ్యాన్‌ చేసిన విషయం తెలిసిందే.

READ ALSO: Subham Review: సమంత నిర్మించిన 'శుభం' సినిమా ఎలా ఉందంటే..

#Single Movie : #సింగిల్ మూవీ రివ్యూ


Updated Date - May 09 , 2025 | 03:13 PM