సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thama: ర‌ష్మిక 'త‌మా' టీజ‌ర్.. మాములుగా లేదుగా!

ABN, Publish Date - Aug 19 , 2025 | 02:23 PM

ఈ యేడు వ‌రుస భారీ విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌తో దూసుకెళుతున్న ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్నా.

Rashmika Mandanna

ఈ యేడు వ‌రుస భారీ విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌తో దూసుకెళుతున్న ముద్దుగుమ్మ ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna) న‌టించిన నూత‌న హిందీ చిత్రం త‌మా. హ్యాట్రిక్ హీరో ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) హీరోగా న‌టించ‌గా ప‌రేశ్ రావెల్ (Paresh Rawal), న‌వాజుద్దీన్ సిద్దిఖీ (Nawazuddin Siddiqui) కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మలైకా అరోరా (Malaika Arora) నోరా ఫతేహి (Nora Fateh) స్పెషల్ డాన్స్ నంబర్లలో మెరవనున్నారు. ఇటీవ‌ల బెహ‌దియా, స్త్రీ, ముంజ్యా, ఛావా వంటి సినిమాల‌తో బాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించిన మాడోక్ ఫిలింస్ (Maddock Films) నిర్మించింది. గ‌తంలో ముంజ్యా, క‌కుడా వంటి హిందీ సినిమాల‌ను డైరెక్ట్ చేసిన ఆదిత్య స‌ర్పోధార్ (Aditya Sarpotdar) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

తాజాగాఈ మూవీ మేక‌ర్స్ మంగ‌ళ‌వారం ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌డంతో పాటు మూవీ విడుద‌ల తేదీని సైతం ప్ర‌క‌టించారు. దీపావ‌ళి సంద‌ర్భంగా థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు మా నుంచి వ‌చ్చిన హ‌ర్ర‌ర్, కామెడీ సినిమాలు చూశారు. ఫ‌స్ట్ టైం ల‌వ్ స్టోరీ వ‌స్తుంది చూసి ఎంజాయ్ చేయండి అంట నిర్మాణ సంస్థ తెలిపింది. అంతేగాక భ‌యం ఎప్పుడూ శ‌క్తివంతంగా ఉండ‌దు, ప్రేమ ఇంత హింసాత్మ‌కంగా ఉండ‌దు అంటూ క్యాప్స‌న్ ఇచ్చారు. ఇదిలాఉంటే ఈ టీజ‌ర్‌ను చూస్తే హ‌ర్ర‌ర్ జాన‌ర్‌లో ల‌వ్‌స్టోరిని మేళ‌వించి తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

Updated Date - Aug 19 , 2025 | 02:23 PM