సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Ranveer Singh: కొత్త‌.. క‌రెంట్ కారు కొన్న ర‌ణ్‌వీర్ సింగ్

ABN, Publish Date - Jul 10 , 2025 | 08:30 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ స్టైల్‌కి, త‌న ఎనర్జీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెరపై ఎంత చురుకుగా కనిపిస్తాడో, నిజ జీవితంలోనూ అంతే వైభవంగా, చ‌లాకీగా ఉంటాడు.

ranveer singh

ప్రముఖ బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) స్టైల్‌కి, త‌న ఎనర్జీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. తెరపై ఎంత చురుకుగా కనిపిస్తాడో, నిజ జీవితంలోనూ అంతే వైభవంగా, చ‌లాకీగా ఉంటాడు. ఇటీవ‌లే ఆయ‌న దురంద‌ర్ (Dhurandhar) అంటూ త‌న అప్‌క‌మింగ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల‌వ‌గా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అయితే.. ఇప్పుడు ఆయ‌న ఓ విలాసవంతమైన కారును కొనుగోలు చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్ప‌టికే త‌న వ‌ద్ద‌, భార్య దీపిక వ‌ద్ద ఓ డ‌జ‌న్ వ‌ర‌కు క‌క‌రీదైన కార్లు ఉండ‌గా కొత్త‌గా ఇప్పుడు మ‌రో కారు ఇంట్లోకి వ‌చ్చింది.

సినిమా పరంగా ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితం విషయంలో తనదైన విభిన్న శైలితో ముద్ర వేసే. రణ్ వీర్ సింగ్ తాజాగా త‌న జ‌న్మ‌దినం సంద‌ర్భంగా సుమారు రూ.5 కోట్ల విలువ గల హమ్మర్ (Hummer) కంపెనీకి చెందిన స్పెషల్ ఎడిషన్ ఈవీ లగ్జరీ కారు Hummer (EV 3X Car)ను తన కలెక్షన్‌లోకి చేర్చుకున్నారు. ఈ కారుకు సంబంధించిన వివరాలను CS12 Vlogs యూట్యూబ్ ఛానల్‌లో ఓ యూట్యూబ‌ర్ తెలిపారు. రణ్ వీర్‌కి చెందిన Maybach GLS600 కారు ఒక ఇంటి నుంచి బయటికి వస్తుండగా, అదే సమయంలో ఫ్రైడే నైట్ కార్స్ (Friday Night Cars) సంస్థ ప్ర‌త్యేక వాహానంలో రెండు హమ్మర్ EVలతో అక్కడికి వ‌చ్చి అందులో ఒకటి రణ్ వీర్‌కు డెలివరీ ఇచ్చిన‌ట్లు ఆ వీడియోలో వివ‌రించారు.


ఫీచ‌ర్స్.. ఇవే

అయితే.. ఈ కారుకు ఇండియాలో అందుబాటులో లేక పోవ‌డంతో అమెరికా నుంచి దిగుమ‌తి చేసుకున్నాడు. కాగా ఈ కారు ధ‌ర అమెరికాలో నేరుగా అయితే సుమారు రూ.84 లక్షల వ‌ర‌కు ఉండగా, మ‌న దేశానికి వ‌చ్చే స‌రికి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలతో కలిపి రూ.3.8 నుంచి 4.5 కోట్ల మధ్య ఖర్చవడం గ‌మ‌నార్హం. ఇదిలాఉంటే హమ్మర్ EV రెండు వేరియంట్లలో 2X మరియు 3X ల‌లో అందుబాటులో ఉండ‌గా 3X వేరియంట్ హై హెండ్‌కు చెందింది. ఇది 830 bhp పవర్ మరియు 15,592 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ SUVలో 178 kWh బ్యాటరీ ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 505 కిలోమీటర్ల వరకు ప్రయాణించవ‌చ్చు. ఇప్పుడు రణ్ వీర్ ఈ వేరియంట్‌ను తీసుకున్నారని చూసిన వారు చెబుతున్నారు.

మ‌రోవైపు.. ఇది 0 నుంచి 100 కిమీ/గంకి కేవలం 3.5 సెకన్లలో చేరగలదు. అంతే కాదు, ఇది "Crab Walk" ఫీచర్‌తో కూడా వస్తుంది. ఒక ప్రత్యేకమైన డ్రైవింగ్ టెక్నిక్, ఇది కారు ను తేలు మాదిరిగా డైగనల్‌గా మలుపులు తీయగలిగేలా చేస్తుంది. అంతేకాదు ఈ కారులో 12.3 అంగుళాల డిజిటల్ క్లస్టర్, 13.4 అంగుళాల టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, జీఎంసీ సూపర్ క్రూయిజ్ వంటి అత్యాధునిక సదుపాయాలున్నాయి. అయితే.. హమ్మర్ EV కారున్న మొట్ట మొద‌టి బాలీవుడ్ సెట‌బ్రిటీ ర‌ణ్ వీర్ సింగే కావ‌డం విశేషం.

Updated Date - Jul 10 , 2025 | 08:30 PM