సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bollywood: మనోజ్ బాజ్ పాయ్ తో రానా సినిమా...

ABN, Publish Date - Nov 06 , 2025 | 03:49 PM

ప్రముఖ నటుడు రానా బాలీవుడ్ లోకి నిర్మాతగా అడుగుపెట్టబోతున్నాడు. లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్ నవలను మనోజ్ బాజ్ పాయ్ తో సినిమాగా నిర్మించబోతున్నాడు.

Rana Daggubati

నటుడిగా, నిర్మాతగా రానా (Rana) జోరు పెంచాడు. హీరో పాత్రలకు గుడ్ బై చెప్పి కొంతకాలంగా సహాయ పాత్రలతో ముందుకు సాగుతున్నాడు దగ్గుబాటి రానా. అంతే కాదు... 2005లో తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియాను ప్రారంభించి, కంటెంట్ డెవలప్ మెంట్, చిత్ర నిర్మాణం, పంపిణీ కార్యక్రమాలను చేస్తున్నాడు. అలానే టాలెంట్ మేనేజ్ మెంట్, బ్రాండ్ మార్కెటింగ్ వ్యవహారాలను స్పిరిట్ మీడియా పర్యవేక్షిస్తుంటుంది. ఇక రానా తనకు నచ్చిన మీడియమ్ అండ్ లో- బడ్జెట్ చిత్రాలను విడుదల చేస్తూ నూతన నటీనటులు, సాంకేతిక నిపుణులను ప్రోత్సహిస్తున్నాడు.


హిందీ చిత్రసీమలోకి 2011లో 'దమ్మారో దమ్' మూవీతో అడుగుపెట్టిన రానా అప్పటి నుండి పలు హిందీ చిత్రాలలో నటించాడు. అయితే ఇప్పుడు తొలిసారి నిర్మాతగానూ అతను బాలీవుడ్ (Bollywood) లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. బూకర్ ప్రైజ్ విన్నింగ్ రైటర్ అరవింద్ అడిగి రాసిన 'లాస్ట్ మ్యాన్ ఇన్ టవర్' (Lost Man in tower) నవల ఆధారంగా రానా ఓ సినిమాను హిందీలో నిర్మించబోతున్నాడు. బెన్ రేఖీ దర్శకత్వం వహించే ఈ సినిమాలో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ (Manoj Bajpayee) ఓ కీలక పాత్రను చేయబోతున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం రానా... దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న 'కాంత'తో పాటు 'డార్క్ చాక్లెట్, సైక్ సిద్ధార్థ్‌', 'ప్రేమంటే' ప్రాజెక్ట్స్ కు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు.

Also Read: KGF Harish Rai: కేజీఎఫ్‌ నటుడు హరీశ్‌ రాయ్‌ కన్నుమూత

Also Read: The Great Pre-Wedding Show Review: ‘ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో’ ఎలా ఉందంటే

Updated Date - Nov 06 , 2025 | 03:49 PM