Ram Gopal Varma: మళ్లీ.. రంగంలోకి ఆర్జీవీ! కొత్త సినిమా.. పోలీస్ స్టేషన్‌లో భూతం
ABN, Publish Date - Sep 01 , 2025 | 04:14 PM
మరోసారి విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
మరోసారి విభిన్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma ). ఆయన దర్శకత్వంలో, నటుడు మనోజ్ బాజ్‌పేయి (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్–కామెడీ చిత్రం “పోలీస్ స్టేషన్ మే భూత్” (Police Station Mein Bhoot) ప్రస్తుతం నిర్మాణం తుది దశలో ఉంది.
తాజాగా వర్మ తన సోషల్ మీడియా వేదికగా సినిమా పోస్టర్ మరియు గ్లింప్స్ వీడియో విడుదల చేశారు. పోస్టర్‌లో మనోజ్ బాజ్‌పేయి పోలీస్ ఆఫీసర్ ఆత్మ రూపంలో కనిపిస్తుండగా, ఆయన చేతిలో ఒక చిన్నారి ఆత్మ రూపం కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది. దీంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. అంతేగాక గతంలో మంచి విజయం సాధించిన “సత్య, కౌన్, షూల్” చిత్రాల తర్వాత మళ్లీ వర్మ–మనోజ్ బాజ్‌పేయి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రం సస్పెన్స్, హారర్, కామెడీ మేళవింపుతో సాగనుందని తెలుస్తోంది.
కథ విషయానికి వస్తే:
ఓ గ్యాంగ్‌స్టర్ ఆత్మ తనను చంపిన పోలీసులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అదే పోలీస్ స్టేషన్‌కి తిరిగి వస్తుంది. పోలీసులు ఆదెయ్యం నుంచి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలను హారర్, కామెడీగా తెరకెక్కించారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో జెనిలియా డిసౌజా (Genelia Dsouza) కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం. “You Can’t Kill the Dead” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ సినిమా ఇప్పటికే సినీప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.