Rakul Preet Singh: మార్పు మంచిదే...
ABN , Publish Date - Sep 10 , 2025 | 09:16 AM
బాల్యంలో జరిగే సంఘటనలు కొందరిని ధీరులను చేస్తాయి. తన విషయంలోనూ అదే జరిగిందని చెబుతోంది రకుల్ ప్రీత్ సింగ్.
చిన్నప్పటి సంఘటనలు మనిషి జీవితం మీద బలమైన ప్రభావం చూపుతుంటాయి. బలహీనమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు కొన్ని సంఘటనలతో మరింత బలహీనపడిపోతే... కొందరు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధైర్యస్థులుగా మారిపోతుంటారు.
పాపులర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) విషయంలో అదే జరిగింది. తన బాల్యానికి సంబంధించిన సంఘటనలను రకుల్ గుర్తు చేసుకుంటూ, ఆర్మీకి సంబంధించిన కుటుంబం నుండి తాను రావడంతో చిన్నప్పటి నుండీ ధైర్యంగానే ఉండే అలవాటు ఏర్పడిందని తెలిపింది. తండ్రి ఉద్యోగ రీత్యా అప్పట్లో పది పాఠశాలలో తన విద్య సాగిందని, అందువల్ల ఎక్కడైనా, ఎలాగైనా సర్దుకుపోవడం తనకు వచ్చేసిందని చెప్పింది. భిన్నమైన సంస్కృతులు, అభిరుచులు ఉన్న వ్యక్తులతో తాను త్వరగా కలిసిపోతానని, దానికి బాల్యం నాటి అనుభవాలే కారణమని తెలిపింది. సినిమా షూటింగ్ కోసం కొన్ని వారాల పాటు కుటుంబానికి దూరంగా ఉన్నా... తనకు పెద్దంత ఇబ్బంది అనిపించదని చెప్పింది. ఎలాంటి అవాంతరాలు, అడ్డంకులు ఎదురైనా... వాటిని అధిగమించే శక్తి తనకు బాల్యం నుండి ఉందని ఆమె చెప్పడం విశేషం. ఈ యేడాది ప్రారంభంలో రకుల్ ప్రీత్ సింగ్ నటించిన 'మేరే హస్బెండ్ కీ బీవీ' సినిమా విడుదలైంది. ప్రస్తుతం ఆమె అజయ్ దేవ్ గణ్ (Ajay Devgn) సరసన 'దే దే ప్యార్ దే' (De De Pyar De) సీక్వెల్ లో నటిస్తోంది.
Also Read: Wednesday Tv Movies: బుధవారం, Sep10.. టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే