The Conjuring Last Rites: రూ.3800 కోట్లు కొల్లగొట్టింది.. సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసింది! సూపర్ నాచురల్ హర్రర్ థ్రిల్లర్
ABN , Publish Date - Oct 07 , 2025 | 12:11 PM
గత నెలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన అమెరికన్ హాలీవుడ్ సూపర్ నాచురల్ హర్రర్ చిత్రం ది కంజూరింగ్ ఫైనల్ రైట్స్.
గత నెలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లకు వచ్చి మంచి విజయం సాధించిన అమెరికన్ హాలీవుడ్ సూపర్ నాచురల్ హర్రర్ చిత్రం ది కంజూరింగ్ ఫైనల్ రైట్స్ (The Conjuring: Last Rites). గత దశాబ్ద కాలంగా ఈ సిరీస్‌లో వచ్చిన చిత్రాలు ప్రజలను విశేషంగా అలరించాయి. అయితే ఇక ఈ కంజూరింగ్ చిత్రాలకు గుడ్ బై చెబుతూ మేకర్స్ ఈ సినిమా చివరి భాగాన్ని సెప్టెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ఎదుటకు తీసుకు రాగా అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. 55 అమెరికన్ డాలర్ల వ్యయం (రూ. 366 కోట్లతో) తో తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 459 డాలర్లు (రూ.3814 కోట్లు ) రాబట్టి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించింది. అలాంటి ఈ చిత్రం రిలీజై నెల కూడా తిరగ కుండానే డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసి ఆడియన్స్ కు షాకిచ్చింది.
వాస్తవ ఘటనల ఆధారంగా ప్రసిద్ధ అమెరికన్ పరానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్ వారెన్, లొరైన్ వారెన్ సంయుక్తంగా కలిసి పరిశీలించిన కేసుల అధారంగా ఈ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో తొలి చిత్రం 2013లో విడుదల కాగా ఈ సిరీస్‌లో నాలుగవది, చివరి చిత్రం ది కంజూరింగ్ ఫైనల్ రైట్స్ ఈ యేడు థియేటర్లకు వచ్చింది. తొలుత రెండు చిత్రాలకు జేమ్స్ వాన్ (James Wan) దర్శకత్వం వహించగా చివరి ఈ రెండు చిత్రాలకు మైఖేల్ చేవ్స్ (Michael Chaves) దర్శకత్వం చేశారు. ఈ నాలుగు సినిమాల్లో పాట్రిక్ విల్సన్ (Patrick Wilson), వెరా ఫార్మిగా (Vera Farmiga) ఎడ్, లొరైన్ వారెన్‌లుగా నటించారు.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. స్మర్ల్ అనే వ్యక్తి ఇంట్లో జరుగుతున్న భయానక ఘటనల ఇష్యూని చేధించడానికి ఎడ్, లొరైన్ వారెన్ దంపతులు అడుగు పెడతారు. అయితే.. ఆ ఇంట్లో దాగి ఉన్న, పగ బట్టి ఉన్న ఓ పాత దెయ్యం వారిని నాశనం చేయాలనుకుంటుంది. వారిని వెంబడిస్తుంది. చివరకు ఎడ్, లొరైన్ ప్రాణాల మీదకు సైతం వస్తుంది. ఈ నేపథ్యంలో అంత కథినమైన దుష్ట శక్తిని వారు ఎలా ఎదుర్కొన్నారు, ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి, ఏం కోల్పోయారనేదే కథ. ఇప్పుడీ ది కంజూరింగ్ ఫైనల్ రైట్స్ (The Conjuring: Last Rites) సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో రెంటల్ పద్దతిలో ఇండియా మినహా ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే..ఇండియాలో కొన్ని ఫ్రీ వెబ్‌సైట్లలో ఇప్పటికే హెచ్డీ ప్రింట్ వచ్చేసింది. థియేటర్లలో మిస్సయిన వారు, ఈ హర్రర్ మూవీ ఫ్రాంచైజీ లవర్స్ తప్పక చూడాల్సిన సినిమా ఇది.