Rahul Dev: నా తమ్ముడు ముకుల్ దేవ్ మరణానికి డిప్రెషన్ కారణం కాదు
ABN , Publish Date - Jun 16 , 2025 | 09:31 PM
బాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్(Rahul Dev) గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Rahul Dev: బాలీవుడ్ విలన్ రాహుల్ దేవ్(Rahul Dev) గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడు, సింహాద్రి, మున్నా, పౌర్ణమి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ దేవ్.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక రాహుల్ దేవ్ తమ్ముడు ముకుల్ దేవ్(Mukul Dev) కూడా విలన్ గా మంచి సినిమాల్లో నటించాడు. కృష్ణ సినిమా ముకుల్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చి పెట్టాయి.
ఈ మధ్యనే ముకుల్ అనారోగ్య సమస్యలతో మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే ముకుల్ దేవ్ మరణానికి డిప్రెషన్ కారణమని, అతడి ఆరోగ్యం పూర్తిగా పాడైపోయిందని, సరిగ్గా ఫిట్ కూడా లేడని వార్తలు వచ్చాయి. తాజాగా ముకుల్ దేవ్ మరణానికి డిప్రెషన్ కారణం కాదు అని రాహుల్ దేవ్ తెలిపాడు. తాజాగా రాహుల్ దేవ్ ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ముకుల్ దేవ్ మరణం గురించిమాట్లాడాడు.
Genelia: జాన్ అబ్రహాంతో పెళ్లి.. నోరు విప్పిన జెనీలియా
" 2019 లో మా తండ్రి మరణించాడు. ఆయన మరణం ముకుల్ ను బాగా కృంగిపోయేలా చేసింది. ఆ తరువాత తల్లి మరణం, భార్య విడాకులు ఇవ్వడంతో ఒంటరి వాడయ్యాడు. దీనివలన ముకుల్ సరిగ్గా తినడం మానేశాడు. ఎవరు అతడికి అండగా లేకపోవడంతో మరింత కృంగిపోయాడు. తనను తాను పట్టించుకోవడం కూడా మానేశాడు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడంతో ఆసుపత్రి పాలయ్యాడు. హాస్పిటల్ లో మూడు రోజులు ఐసీయూలో ఉన్నాడు.
సరైన ఫుడ్ తినకపోవడంతోనే అతను అనారోగ్యానికి గురయ్యాడని డాక్టర్లు తెలిపారు. కానీ, ముకుల్ మరణం గురించి బయట చాలా వార్తలు వచ్చాయి. అతడి గురించి ఆరోపణలు చేస్తున్నవారు ఎప్పుడైనా హాస్పిటల్ కి వచ్చి అతడిని పరామర్శించారా.. ? నా తమ్ముడు ఎప్పుడు ఒంటరిగా ఉండడానికే ఇష్టపడేవాడు. తన ఆరోగ్యాపి శ్రద్ద చూపకపోవడంతోనే మరణించాడు" అంటూ చెప్పుకొచ్చాడు.