SARZAMEEN: ఫృథ్వీరాజ్ సుకుమారన్.. బాలీవుడ్ మూవీ సర్జమీన్ ట్రైలర్
ABN , Publish Date - Jun 30 , 2025 | 01:48 PM
ఫృథ్వీరాజ్ సుకుమారన్, కాజోల్, ఇబ్రహీం అలీఖాన్ కాంబినేషన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం సర్జమీన్
మలయాళ సూపర్ స్టార్ ఫృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran), కాజోల్ (Kajol), ఇబ్రహీం అలీఖాన్ (Ibrahim Ali Khan) కాంబినేషన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న బాలీవుడ్ చిత్రం సర్జమీన్ (Sarzameen). హిందీ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఈ సినిమాను నిర్మించగా రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందించాడు. ప్రముఖ నటుడు బొమన్ ఇరానీ (Boman Irani) తనయుడు కయోజ్ ఇరానీ (Kayoze Irani) దర్శకత్వం వహించాడు.
కాశ్మీర్ ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమ వారం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. జూలై 25న జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో విడుదల కానుంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే పూర్తిగా కాశ్మీర్ నేపథ్యంలోనే ఉగ్రవాదులకు, మిలిటరీ బ్యాక్డ్రాప్‌లో ఈ సర్జమీన్ (Sarzameen) సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.