Mumbai Film City: ఊహకందని విధంగా...

ABN , Publish Date - May 07 , 2025 | 06:24 PM

ముంబైలో అతి స్టూడియో నిర్మాణంకు భూమి జరనుంది. దాదాపు 200 ఎకరాల్లో 3000 కోట్లతో నిర్మించనున్నారు. ఆ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదిరినట్లు తెలుస్తోంది.

ముంబై (Mumbai) మహా నగరానికి మరో మణిహారం రాబోతోంది. ఇప్పటికే ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించిన ఈ మహానగరంలో అతి పెద్ద స్డూడియో నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో ఫిల్మ్ సిటీ నిర్మించాలని డిఎన్ఇజీ ( (DNEG) ) - ప్రైమ్ ఫోకస్ కంపెనీ (Prime Focus Company) ప్రణాళికలు వేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు 3000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. డిఎన్ఇజి కంపెనీ మ‌హారాష్ట్ర ప్రభుత్వంతో ఈ విషయమై ఒప్పందం కూడా కుదుర్చుకుంది. దీంతో ఈ ఏడాది చివరిలోనే భూమి పూజా చేయనున్నట్లు తెలుస్తోంది.


ఈ ఫిల్మ్ స్టూడియో కాన్సెప్ట్ ఆస‌క్తకంగా ఉండనుందట. స్టూడియోని పూర్తిగా రామాయ‌ణం నేప‌థ్యంలో సెట‌ప్ తో నిర్మిస్తార‌ట. వినోద ఉద్యానవనం, హోటళ్ళు, నివాస వసతి సహా పూర్తి వినోద పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఈ సంవత్సరం చివర్లో ప్రారంభ‌మ‌వుతుందని తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిల్మ్ మేకర్స్ కు... వన్ స్టాప్ డెస్టినేషన్ గా ఉండేలా దీనిని నిర్మించాలనుకుంటున్నారట. అవసరమైన 24 క్రాఫ్ట్స్‌ ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారట.

ఈ ఫిలిమ్ స్టూడియో ద్వారా ఉపాధి అవకాశాలు కలిగేలా నిర్మించనున్నారట. దీని నిర్మాణం వల్ల దాదాపు 2, 500 మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ముంబైలో జరిగిన వేవ్స్ 2025 సమ్మిట్ సందర్భంగా ప్రైమ్ ఫోకస్ వ్యవస్థాపకుడు నమిత్ మల్హోత్రా (Namit Malhotra) త‌న విజ‌న్ ను పంచుకున్నాడు. ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న‌ రామాయణం (Ramayanam) చిత్రాన్ని గ్లోబల్ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా రూపొందిస్తున్నామ‌న్నారు. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ((VFX)) వ‌ర్క్ మ‌రో లెవ‌ల్లో ఉంటుంద‌ని... పురాణేతిహాసానికి విజువ‌ల్ గా జ‌వ‌జీవాలు తెస్తున్నామ‌న్నారు. ముంబైలో స్టూడియో నిర్మాణానికి స‌హ‌క‌రిస్తున్న సీఎం ఫ‌డ్న‌విస్ (Devendra Fadnavis) ని న‌మిత్ మ‌ల్హోత్రా ప్ర‌శంసించారు. డూన్ పార్ట్ 2 చిత్రంలో వీఎఫ్ ఎక్స్ కి ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న న‌మిత్ మ‌ల్హోత్రా ఆ త‌ర్వాత భారీ ప్రాజెక్టుల‌ను ప్రారంభిస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు.

Updated Date - May 07 , 2025 | 06:32 PM