Prerana Arora: ‘జటాధర’ నిర్మాత.. అడ్వెంచర్ సినిమా
ABN, Publish Date - Dec 09 , 2025 | 06:43 PM
‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మాన్’, ‘పరీ’ వంటి జాతీయ అవార్డు సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు యువ మహిళా నిర్మాత ప్రేరణ అరోరా.
‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మాన్’, ‘పరీ’ వంటి జాతీయ అవార్డు సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు యువ మహిళా నిర్మాత ప్రేరణ అరోరా (Prerana Arora). ఇటీవల తెలుగులో ‘జటాధరా’ (Jatadhara) సినిమాను నిర్మించారు. ప్రస్తుతం జీ స్టూడియోస్‌తో కలిసి మూడో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ నెల 8న తన పుట్టినరోజు సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ఓ అడ్వెంచర్ సినిమాను ప్రకటించారు.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తుండగా, కీర్తన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమె నిర్మాణంలో వచ్చిన ‘జటాధరా’ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు దక్షిణాదిపై కూడా దృష్టి సారిస్తున్నారు.