Saare Jahan Se Accha ott: స్కామ్ 92 న‌టుడి.. కొత్త స్పై థ్రిల్ల‌ర్ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

ABN , Publish Date - Jul 18 , 2025 | 01:55 PM

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ వినూత్న సిరీస్ కొత్త స్పై థ్రిల్లర్ సారే జహాన్ సె అచ్చా రెడీ అయింది.

Saare Jahan Se Accha

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఓ వినూత్న సిరీస్ కొత్త స్పై థ్రిల్లర్ సారే జహాన్ సె అచ్చా (Saare Jahan Se Accha) రెడీ అయింది. స్కామ్ 1992 సిరీస్‌తో దేశ వ్యాప్తంగా విపీరీత‌మైన గుర్తింపును తెచ్చుకున్న ప్రతీక్ గాంధీ ( Pratik Gandhi) ఇందులో లీడ్ రోల్‌లో న‌టించాడు. తిలోత్త‌మ (Tillotama), స‌న్నీ హిందుజా (Sunny Hinduja), కృతిక క‌మ్రా, ర‌జ‌త్ క‌పూర్ (Rajat Kapoor), కునాల్ ఠాకూర్, అనూప్ సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. గౌర‌వ్ శుక్లా (Gaurav Shukla) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

1970లలో దేశం రాజకీయ, అంతర్జాతీయ ఉద్రిక్తతల నడుమ ఉన్న స‌మ‌యంలో ఒక గూఢచారి తన ప్రాణాలను పణంగా పెట్టి, అణు ముప్పును అడ్డుకునేందుకు గాను ఓ రహస్య మిషన్‌లో అడుగుపెడతాడు. ఈ ప్రయాణంలో అతడిని ఎదుర్కొనే సవాళ్లు, ద్రోహాలు, ఇత్యాది ఈస‌క్తిక‌ర‌మైన క‌థ‌క‌థ‌నాల‌తో ఉత్కంఠభరితంగా ఈ సిరీస్ ఉండ‌నుంది. ఆగ‌ష్టు 13 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో హిందీతో పాటు ఇత‌ర భాష‌ల్లోనూ స్ట్రీమింగ్ అవ‌నుంది. తాజాగా ఈ రిలీజ్ చేసిన టీజ‌ర్ ఈ సిరీస్ పై ఒక్క‌సారిగా అంచ‌నాల‌ను పెంచేసేదిగా ఉంది.

Updated Date - Jul 18 , 2025 | 01:55 PM