సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Parineeti Chopra: త‌ల్లిగా ప్ర‌మోష‌న్ పొందిన‌.. ప్రియాంక చోప్రా సోద‌రి

ABN, Publish Date - Oct 19 , 2025 | 09:30 PM

బాలీవుడ్ బ్యూటీ, ప్రియాంకా సోద‌రి ప‌రిణితి చోప్రా (Parineeti Chopra) అమ్మ‌గా ప్ర‌మోష‌న్ పొందింది.

Parineeti Chopra

బాలీవుడ్ బ్యూటీ, ప్రియాంకా సోద‌రి ప‌రిణితి చోప్రా (Parineeti Chopra) అమ్మ‌గా ప్ర‌మోష‌న్ పొందింది. ఆదివారం ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. సామాజిక మాధ్య‌మం ద్వారా ప‌రిణితీ చోప్రా ఈ విష‌యాన్ని వెళ్ల‌డించింది. “చివరకు మా బేబీ బాయ్ వచ్చాడు. మా జీవితాలు మరింత ఆనంద‌భ‌రితం అయ్యాయి. మొదట మేమిద్దరం మాత్రమే, ఇప్పుడు మా కుటుంబం మరింత సంతోషంగా మారింది.” అంటూ వ్రాసుకొచ్చింది.

2011లో బాలీవుడ్‌లోకి వ‌చ్చిన పరిణీతి చోప్రా 2023 సెప్టెంబ‌ర్‌లో ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చడ్డా (Raghav Chadha)ను పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ శుభవార్త నేప‌థ్యంలో ప్రియాంక చోప్రా, అలియా భట్, కృతి సనన్ లాంటి ప్రముఖులు ప‌రిణితి జంటకు అభినందనలు తెలిపారు.

Updated Date - Oct 19 , 2025 | 09:39 PM