సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Zubeen Garg Death: సింగర్‌ జుబీన్‌ కేసులో మ్యుజీషియన్‌ అరెస్ట్‌..

ABN, Publish Date - Sep 26 , 2025 | 09:53 AM

అస్సాంకు చెందిన సింగర్‌ జుబీన్‌ గార్గ్‌ (52) ఇటీవల సింగపూర్‌లో మృతి చెందారు. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10 మందితో సిట్‌ ఏర్పాటు చేసింది.

Zubeen Garg

అస్సాంకు చెందిన సింగర్‌ జుబీన్‌ గార్గ్‌ (Zubeen Garg - 52) ఇటీవల సింగపూర్‌లో మృతి చెందారు. ఈ నెల 19న సింగపూర్‌లో సముద్ర ఈతకు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అస్సాం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 10 మందితో సిట్‌ ఏర్పాటు చేసింది. దీంతో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఆయన మేనేజర్‌ సిద్దార్థ్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్‌ ఇళ్లలో ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు నిర్వహించింది.

అదే రోజు సౌండ్‌ రికార్డిస్ట్‌ నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. అలాగే మ్యుజీషియన్‌ శేఖర్‌ జ్యోతి గోస్వామిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. జుబీన్‌తోపాటు ఘటన జరిగిన రోజు బోటులో గోస్వామి కూడా ప్రయాణించినట్లు తెలిసింది. జుబీన్‌ మృతికి కారణమైన వారిని వదిలేది లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించారు.

 

Updated Date - Sep 26 , 2025 | 10:04 AM