సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mrunal Thakur: క్రికెటర్‌తో డేటింగ్‌.. నిజమేనా మృణాల్‌..

ABN, Publish Date - Dec 01 , 2025 | 07:47 PM

‘సీతారామం’తో టాలీవుడ్‌లో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు మృణాల్‌ ఠాకూర్‌ (mrunal Thakur). తదుపరి దక్షిణాదిలో వరుస చిత్రాల్లో నటిస్తున్నారామె. అయితే కొంతకాలంగా ఆమె పేరు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

‘సీతారామం’తో టాలీవుడ్‌లో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు మృణాల్‌ ఠాకూర్‌ (mrunal Thakur). తదుపరి దక్షిణాదిలో వరుస చిత్రాల్లో నటిస్తున్నారామె. అయితే కొంతకాలంగా ఆమె పేరు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. మొన్నటి వరకూ హీరో ధనుష్‌తో (Dating with Dhanush) డేటింగ్‌లో ఉందని, అతనితో పెళ్లి సిద్ధమైందని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా మరో పేరు వెలుగులోకి వచ్చింది. టీమ్‌ ఇండియా స్ట్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో (Shreyas iyer) తాను డేటింగ్‌లో ఉందని వైరల్‌ అవుతున్నాయి. అయితే దీనిపై మృణాల్‌ స్పందించారు.

‘ఇలాంటి రూమర్స్‌ వినడానికి కూడా ఫన్నీగా ఉంటాయి. వాళ్లు వార్తలు వండుతుంటారు. నేను వాటిని చూసి నేను నవ్వుకుంటాను. ఫ్రీ పీఆర్‌ స్టంట్స్‌ ఇవి’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టింది. ఇలా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌కు చెక్‌ పెట్టారు. ధనుష్‌పై వచ్చిన రూమర్స్‌ను ఆమె ఖండించారు.

అయితే ఆమెపై ఇలా రూమర్స్‌ రావడం ఇది మొదటిసారి ఏం కాదు. గతంలోనూ చాలా వచ్చాయి. ఓ టాలీవుడ్‌ నటుడిని మృణాల్‌ వివాహం చేసుకోనున్నారంటూ కొంతకాలం క్రితం నెట్టింట చర్చ జరిగింది. జెర్సీ హిందీ రీమేక్‌ ప్రమోషన్స్‌లో మాట్లాడుతూ ఓ ప్రముఖ క్రికెటర్‌పై అభిమానం వ్యక్తం చేయగా.. ఆ క్రీడాకారుడితో ఆమె రిలేషన్‌ ఉందంటూ నేషనల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ చేశారు.

‘సన్నాఫ్‌ సర్దార్‌ 2’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చారు మృణాల్‌. ‘దో దీవానే శహర్‌ మే’ సహా మరో రెండు హిందీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో అడివి శేష్‌ సరసన నటిస్తున్న ‘డెకాయిట్‌’ హిందీలోనూ విడుదల కానుంది.

Updated Date - Dec 01 , 2025 | 07:54 PM