Manoj bajpayee: బాలీవుడ్‌ నటుల్లో అభద్రతా భావం ఎక్కువ..

ABN , Publish Date - Dec 15 , 2025 | 10:58 AM

విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj bajpayee) ఎన్నో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family Man 3) వెబ్‌ సిరీస్‌ ఆయన స్థాయిని మార్చేసింది.



విలక్షణ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj bajpayee) ఎన్నో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ (The Family Man 3) వెబ్‌ సిరీస్‌ ఆయన స్థాయిని మార్చేసింది. ఈ సిరీస్‌తో ఆయన నటుడిగా మరో పది మెట్టు ఎక్కినంత గుర్తింపు పొందారు. తాజాగా ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 3’, ‘ఇన్‌స్పెక్టర్‌ జెండే’ చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన ప్రస్తుతం ‘పోలీస్‌ స్టేషన్‌ మెయిన్‌ భూత్‌’ (Police Station Main Bhoot) చిత్రీకరణలో ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను పుట్టుకతోనే కష్టజీవినని అన్నారు.

‘బాలీవుడ్‌ నటుల్లో ఉన్న అభద్రతా గురించి జనాలకు చెప్పాలనుకుంటున్నా. అక్కడ నటులు ఎప్పుడూ ఒకరినొకరు ప్రశంసించుకోరు. వారిలో అభద్రతాభావం ఎక్కువ. అందుకే ఒకరి పనిని ఒకరు గుర్తించడానికి అభినందించడానికి కనీసం ఫోన్‌ కూడా చేయరు. బాలీవుడ్‌లో నటుల మధ్య అభద్రతా, పోటీ భయం చాలా డెప్త్‌లో ఉంటాయి. నేను ఇప్పటికీ ఓ మంచి పాత్ర కోసం ఫోన్‌ చేసి అడుగుతాను. నా పని, నటన  తీరు గురించి నా పని గురించి అడిగి తెలుసుంటా. ఏదైనా పొరపాటు జరిగి సినిమా ఆడకపోతే దానికి కారణమేంటనేది తెలుసుకుంటా. సినిమా అంటే గ్లామర్‌, సక్సెస్‌, కలెక్షన్లు ఇదే కాదు. తెర వెనుక కథ, వాస్తవికత వేరే ఉంటుంది. ఎంతో పోటీ ఉన్న సముద్రంలాంటి చిత్ర పరిశ్రమలో తమని తాము నిరూపించుకోవడానికి రోజుకి ఎంతోమంది వస్తుంటారు. ఇక్కడ ఓ ఆర్టిస్ట్‌ తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అంత ఈజీ పని కాదు. ఒక సినిమా చేశాక.. రెండో సినిమా ఉంటుందో చెప్పలేం. కేవలం నెక్ట్స్‌ ఆఫర్‌ అనేది కృషి పట్టుదల మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ నిలబడాలంటూ నిత్యం నిరపించుకోవలసిందే! ఆ విషయంలో నేను పుట్టుకతోనే యోధుడినని భావిస్తా. ఇంత అనుభవం ఉన్నా కూడా నెక్ట్స్‌ క్యారెక్టర్‌ ఏంటనే భయం నుంచి విముక్తి పొందలేకుండా ఉన్నా. ఆ ఆందోళన ఉంటేనే సక్సెస్‌ వస్తుందనుకుంటా. నా దృష్టిలో నటుడు సురక్షితంగా భావించినప్పుడే నిజమైన విజయం వస్తుంది. ఆ స్థానాన్ని సాధించడమే ఇక్కడ అంత ఈజీ కాదు’ అన్నారు.  

Updated Date - Dec 15 , 2025 | 11:00 AM