సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nikhil Nagesh Bhat: హాలీవుడ్ బాటలో కిల్ డైరెక్టర్

ABN, Publish Date - Aug 29 , 2025 | 02:38 PM

ఆ బాలీవుడ్ డైరెక్టర్ పంట పండింది. ఒక్క సినిమా మొత్తం కెరీర్‌ నే మ‌లుపు తిప్పింది. బీటౌన్‌నే కాదు.. మొత్తం గ్లోబ‌ల్ మార్కెట్‌నే క‌దిలించే ఆప‌ర్చునిటీ వ‌చ్చి ప‌డింది. దానికి సంబంధించిన అప్డేట్స్ వింటుంటేనే అప్ క‌మింగ్ ప్రాజెక్ట్ పై అంచ‌నాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

బాలీవుడ్‌లో విభిన్నమైన యాక్షన్ సినిమాగా వ‌చ్చిన‌ ‘కిల్’ (Kill) సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పన‌క్కర్లేదు. రైలులో దొంగల గుండెల్లో వణుకు పుట్టించే యాక్షన్ సన్నివేశాలతో, ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నిఖిల్ నగేష్ భట్ (Nikhil Nagesh Bhat) దర్శకత్వంలో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీంతో నిఖిల్ నగేష్ భట్ పై అందరి దృష్టి పడింది. ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లపై సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం నిఖిల్, నిర్మాత మురాద్ ఖేతాని (Murad Khetani) తో కలిసి ఓ కొత్త ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. ఇది ఇప్పటికే ప్రీ - ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే, ఇప్పుడు మరో సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


నిఖిల్ నగేష్ భట్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడట. అది కూడా హాలీవుడ్ దిగ్గజం యూనివర్సల్ స్టూడియోస్ ( Hollywood Universal Studios) లో ఓ భారీ ప్రాజెక్ట్‌తో అరంగేట్రం చేయనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే యూనివర్సల్ స్టూడియోస్ అధికారులతో చర్చలు జరిగాయని, ఒప్పందం చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఓ గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుందని, భారీ బడ్జెట్‌తో హైలెవెల్ యాక్షన్ సన్నివేశాలతో ఇది రూపొందనుందని అంటున్నారు. స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయట.

ఈ సినిమా నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుందని అంటున్నారు. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని, క్యాస్టింగ్ కోసం సంప్రదింపులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్యాస్టింగ్ భారతీయ సినీ అభిమానులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని టాక్. అంతేకాక బాలీవుడ్ నుంచి ఓ ప్రముఖ నటుడు గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం అవుతుందట. మరి నిఖిల్ హాలీవుడ్ అరంగేట్రంతో ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి.

Updated Date - Aug 29 , 2025 | 02:38 PM