The Kerala Story: అవార్డు దక్కినా ఆగని విమర్శలు.. ఏకంగా ముఖ్యమంత్రే..
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:47 PM
ది కేరళ స్టోరీ చిత్రానికి నేషనల్ అవార్డు రావడం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశవ్యాప్తంగా సినీ, రాజకీయం రంగాల్లో సంచలనం సృష్టించి, చర్చనీయాంశమైన చిత్రాల్లో సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ (The Kerala story) ఒకటి. ఇప్పుడీ చిత్రానికి నేషనల్ అవార్డు వరించింది. ఉత్తమ దర్శకుడిగా సుదీప్తోసేన్(Sudipto Sen), ఉత్తమ ఛాయగ్రాహణం విభాగాల్లో పసంతను మొహపాత్రో అవార్డు సొంతం చేసుకున్నారు. దీనిపై దర్శకుడు స్పందించారు. ఈ అవార్డును (National award) ప్రకటించిన వెంటనే అదాశర్మకు ఫోన్ చేసి మాట్లాడాను. ఆమె ఆనందానికి అవధులు లేవు అని ఆయన తెలిపారు.
సుదీప్తో సేన్ మాట్లాడుతూ ‘10 ఏళ్ల పోరాటానికి ఈ అవార్డు నిదర్శనంగా నిలిచింది. చాలా ఆనందంగా ఉంది. కానీ, ఉత్తమ చిత్రంగా అవార్డు వరించి ఉంటే ఇంకా ఆనందంగా ఉండే వాడిని. తొలుత ఈ చిత్రాన్ని కేవలం ఓ మతానికి సంబంధించినదిగా భావించారు. దీన్ని చూశాక అది తప్పని వారు అర్థం చేసుకున్నారు. ప్రతిఒక్కరికీ ఇది కనెక్ట్ అయింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ అవార్డు వచ్చింది. సినీ ప్రియులు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి మాట్లాడుతూనే ఉంటారు. థియేటర్‌లోనే పెద్ద హిట్ అంటే.. ఓటీటీలో అందుబాటులోకి వచ్చాక ఇది రెట్టింపు అయింది. 70 వారాల్లో దాదాపు 35 వారాలకు పైగా ఈ సినిమా టాప్ 10లో ఉంది. ప్రేక్షకులు మాపై చూపించిన ప్రేమకు నిదర్శనం. సినిమా షూటింగ్ ప్రారంభించినప్పుడు సినిమా ఇంతగా విజయం సాధిస్తుందని ఊహించలేదు. దీనికోసం పదేళ్ల చేసిన పరిశోధనకు, మా పోరాటాలకు ఈ అవార్డు ప్రతిఫలం’ అని అన్నారు.
అదా శర్మ కీలక పాత్ర పోషించిన చిత్రమిది. అవార్డ్ వరించడం పట్ల ఆమె కూడా స్పందించారు. ఈ మూవీ చూసి ఎంతో మంది భావోద్వేగానికి గురయ్యారు. ఆలోచనలో పడ్డారు. ఎంతోమంది ట్రోల్ చేసి చర్చనీయాంశం చేసినవారు కూడా ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతున్నా. భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మహిళ ప్రాధాన చిత్రంగా నిలిచింది. ఈ విజయానికి కారణమైన వారందరికీ రుణపడి ఉంటాను’ అని అన్నారు. నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా కూడా అవార్డులు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సినిమా చుట్టూ వివాదాలు చుట్టుముట్టినప్పడానికి ప్రభుత్వం సరైన గౌరవాన్ని ఇచ్చారని నిర్మాత కృతజ్ఞతలు తెలిపారు.
ఇప్పటికీ విమర్శలే..
'ది కేరళ స్టోరీ' చిత్రానికి నేషనల్ అవార్డు రావడం పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ చిత్రానికి అవార్డు ఇవ్వడం కేరళను అవమానించడమేనన్నారు. తాజాగా దీనిపై జ్యూరీ సభ్యుల్లో ఒకరైన అశుతోష్ గోవారికర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అవార్డు ఇవ్వడానికి గల కారణాన్ని చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ స్పష్టంగా ఉందని, కథకు తగ్గట్లు సూట్ అయిందనీ, దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుని అవార్డు ప్రకటించినట్లు చెప్పారు.