సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Karthik Aaryan: చక్ దే ఇండియా డైరెక్ట‌ర్‌తో.. కార్తీక్ ఆర్య‌న్‌

ABN, Publish Date - Aug 15 , 2025 | 01:10 PM

అప్పుడెప్పుడో మధ్యలోనే ఆగిపోయిన కెప్టెన్ ఇండియా ప్రాజెక్ట్ మళ్లీ పునః ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Karthik Aaryan

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ (Karthik Aaryan,) వ‌రుస విజయ వంత‌మైన చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు. ఇప్ప‌టికే చందు ఛాంపియన్, భూల్ భులయ్యా 3 వంటి హిట్ సినిమాల‌తో స్టార్‌డమ్ స్టార్‌డ‌మ్‌, మార్కెట్ సంపాదించుకున్నఆయ‌న‌ ప్రస్తుతం రెండు కొత్త చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అంఉలో ఒక‌టి తెలుగు ముద్దుగుమ్మ శ్రీలీల‌తో క‌లిసి మ్యూజికల్ రొమాంటిక్ మూవీ కాగా మరొకటి తూ మేరి మేన్ తేరా మేన్ తేరీ తూ మేరీ. ఇవి రెండూ ఇప్పుడు షూటింగ్ దశలో ఉన్నాయి.

ఇదిలా ఉండగా.. అప్పుడెప్పుడో మధ్యలోనే ఆగిపోయిన కెప్టెన్ ఇండియా ప్రాజెక్ట్ మళ్లీ పునః ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. మొదట హన్సల్ మెహతా దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్ అయ్యి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతున్న స‌మ‌యంలోనే అనుకోకుండా ఆగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆయ‌న స్థానంలో ఈ ప్రాజెక్ట్ లోకి చక్ దే ఇండియా (Chak De! India) ఫేమ్ షమీత్ అమీన్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. గత కొన్ని రోజులుగా కార్తీక్ మరియు షమీత్ అమీన్ (Shimit Amin) చర్చలు జరిపి, చివరికి వారిద్ద‌రి మ‌ధ్య‌ ఒప్పందం కుదిరింద‌ని, వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ ప్రారంభించాలనే ప్లాన్ చేస్తు్న‌న‌ట్లు స‌మాచచారం. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

షమీత్ అమీన్ చివరిసారిగా 2020లో ఏ సూటబుల్ బాయ్ టీవీ సిరీస్‌కి దర్శకత్వం వహించాడు. 2007లో వచ్చిన చక్ దే ఇండియా(Chak De! India)తో ఆయనకు ప్రత్యేక గుర్తింపు లభించింది. 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం రూ. 109 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికీ, ఆ విజయంతో షమీత్ (Shimit Amin) పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఇప్పుడు ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ ‘డైరెక్టర్ చెయిర్’లో కూర్చోబోతుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - Aug 15 , 2025 | 01:10 PM