Kajol: రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు.. మాటమార్చిన కాజోల్
ABN , Publish Date - Jun 23 , 2025 | 09:45 PM
బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) మాట మార్చింది. మూడు రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)ని భయానక ప్రదేశం అన్న ఆమె.. తాజాగా అదే ఎంతో భద్రత కలిగిన ప్రదేశం అని చెప్పుకొచ్చింది.
Kajol: బాలీవుడ్ నటి కాజోల్ (Kajol) మాట మార్చింది. మూడు రోజుల క్రితం రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City)ని భయానక ప్రదేశం అన్న ఆమె.. తాజాగా అదే ఎంతో భద్రత కలిగిన ప్రదేశం అని చెప్పుకొచ్చింది. అసలు విషయంలోకి వెళితే.. కాజోల్ నటిస్తున్న మా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ప్రదేశం. అక్కడ నెగిటివ్ వైబ్ ఉంటుంది. మరోసారి ఎప్పుడు వెళ్లకూడని ప్రదేశాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఒకటి అని చెప్పుకొచ్చింది. దీంతో కాజోల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేసాయి.
కాజోల్ ఇలా రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు ఉన్నాయని చెప్పగానే కొందరు ట్రోలర్స్.. అంతకుముందు ఇలాంటి అనుభూతినే ఎదుర్కున్న హీరోయిన్స్ తాప్సీ, రాశీ ఖన్నా చెప్పిన వీడియోలను కూడా యాడ్ చేసి వైరల్ చేశారు. దీంతో రామోజీ ఫిల్మ్ సిటీలో నిజంగానే ఏదో నెగిటివ్ వైబ్ ఉందని చాలామంది కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఇప్పుడు ఏమైందో ఏమో కానీ, కాజోల్ మాట మార్చింది. రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోపై స్పందించింది.
'నా సినిమా మా ని ప్రమోట్ చేసే సందర్భంలో రామోజీ ఫిల్మ్ సిటీ గురించి నేను ఇంతకు ముందు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించాలనుకుంటున్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో అనేక సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నాను. చాలా సంవత్సరాలుగా అక్కడ చాలాసార్లు బస చేస్తూనే వస్తున్నాను. సినిమా నిర్మాణానికి ఇది చాలా ప్రొఫెషనల్ వాతావరణం అని నేను ఎల్లప్పుడూ చెప్పగలను. అక్కడ చాలా మంది పర్యాటకులు వచ్చి వారి కుటుంబాలతో ఆనందించడం నేను చూశాను. ఇది గొప్ప గమ్యస్థానం. కుటుంబాలు మరియు పిల్లలకు పూర్తిగా సురక్షితం' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ పై నెటిజన్స్ పలురకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అప్పుడు భయానకం అని, ఇప్పుడు భద్రం అంటున్నావా అని కొందరు. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నావ్ అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Vijay Varma: తమన్నాను వదిలి దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్ ..?