Vijay Varma: తమన్నాను వదిలి దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్ ..?
ABN , Publish Date - Jun 23 , 2025 | 08:39 PM
విజయ్ వర్మ.. బాలీవుడ్ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు. తెలుగులో నాని నటించిన MCA సినిమాలో విలన్ గా పరిచయమయ్యాడు
Vijay Varma: ఈ మధ్యకాలంలో ఎవరైనా ప్రేమించుకుంటున్నారు అంటే.. చాలామంది అడిగే ప్రశ్న.. ఎన్నాళ్లు అని. వారు పెళ్లి చేసుకుంటారా.. ? మధ్యలోనే విడిపోతారా.. ? అనేది వారికి కూడా తెలియడం లేదు. కొందరు అయితే ముందుగా విడిపోతామని తెలిసినా కూడా రిలేషన్ షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ప్రేమలు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అని చెప్పుకొస్తున్నారు. ఎవరు ఎప్పుడు కలుస్తున్నారో.. ఎందుకు విడిపోతున్నారో అనేది ఎవరికి తెలియదు. విడిపోయి ఏడాది కూడా కాకముందే మరొకరితో రిలేషన్ మొదలుప్ పెట్టేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) కొత్తప్రేమాయణం మొదలుపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విజయ్ వర్మ.. బాలీవుడ్ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు. తెలుగులో నాని నటించిన MCA సినిమాలో విలన్ గా పరిచయమయ్యాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో విజయ్ వర్మ టాలీవుడ్ కు టాటా చెప్పేసి బాలీవుడ్ లోనే పాగా వేశాడు. అక్కడ స్టార్ హీరోల సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ సమయంలోనే అతడికి మిల్కీ బ్యూటీ తమన్నా (Thamannah) పరిచయమైంది. ఆ పరిచయం.. ప్రణయంగా మారింది. తమ్ములాంటి హీరోయిన్ కు విజయ్ వర్మ బాయ్ ఫ్రెండ్ ఏంటి అని రకరకాల ట్రోల్స్ నడిచాయి.
టాలీవుడ్ లో ఛాన్స్ లు రాక.. బాలీవుడ్ కి వెళ్లి అందాల ఆరబోతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది తమన్నా. లస్ట్ స్టోరీస్, జీ ఖర్దా వెబ్ సిరీస్ లలో తమ్మును చూసి తెలుగు ప్రేక్షకులు ఖంగుతిన్నారు. అలా అమ్మడు కూడా బాలీవుడ్ లోనే పాగా వేసింది. ఇక తమన్నా, విజయ్ వర్మ చెట్టాపట్టాలేసుకొని కెమెరా కంటికి కనిపిస్తూనే ఉన్నారు. ఒకానొకరోజు వీరి బంధాన్ని అధికారికం చేశారు. విజయ్ లాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం తన అదృష్టమని, అతనిలా తనను ఎవరు అర్ధం చేసుకోలేదని చెప్పుకొచ్చింది. తమన్నాతో రిలేషన్ తరువాత విజయ్ కు మంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి.
సర్లే.. ఇద్దరు ప్రేమలో ఉన్నారు.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారు కదా అనుకొనేలోపు పెద్ద బాంబ్ పేల్చారు. ఏమైందో ఏమో తెలియదు ఇద్దరు లవర్స్ గా కాకుండా ఫ్రెండ్స్ గా మారారు. కలిసి కనిపించడం తగ్గింది. ఎవరి ప్రాజెక్ట్స్ తో వారు బిజీ అయ్యారు. తమ్ము కొన్నిసార్లు బ్రేకప్ బాధకు గురైనట్లు కనిపించేది. అయ్యో.. మంచి జంట విడిపోయారే అని అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. అయితే తమ్ముతో బ్రేకప్ అయ్యి ఏడాది కూడా పూర్తి కాలేదు విజయ్ మరో నటితో డేటింగ్ మొదలుపెట్టడం బాలీవుడ్ మీడియాను షేక్ చేసింది.
దంగల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఫాతిమా సనా షేక్ తో విజయ్ వర్మ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా వీరిద్దరూ కలిసి రెస్టారెంట్ బయట కనిపించడం అభిమానులను షాక్ కు గురిచేస్తుంది. తాజాగా వీరిద్దరి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్స్.. ఈ కొత్త జర్నీ ఎన్నాళ్లు.. అని కామెంట్స్ పెడుతున్నారు.
Manchu Vishnu: మరో వివాదానికి తెరలేపిన మంచు విష్ణు..