సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ మీద ప్రేమ ఓకే కానీ.. మరీ పబ్లిక్ లో ఇలా చేస్తే ఎలా పాప

ABN, Publish Date - Jul 14 , 2025 | 06:17 PM

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kpoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ.. ఆనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా ఎదిగింది.

Janhvi Kapoor

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kpoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ.. ఆనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా ఎదిగింది. ఇక దేవర (Devara) సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా తన అందంతో మెప్పించింది. ప్రస్తుతం పెద్ది (Peddi) సినిమాతో బిజీగా ఉంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రాదు అవుతోంది.


ఇక జాన్వీ సినిమాల విషయం పక్కనపెడితే.. గత కొంతకాలంగా అమ్మడు శిఖర్ పహారియాతో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెల్సిందే. బిజినెస్ మ్యాన్ గా శిఖర్ మంచి పేరునే తెచ్చుకున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ.. హద్దులు దాటుతుందని బాలీవుడ్ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ ప్రేమ, పెళ్లి విషయాల్లో అందరిలాంటి అమ్మాయి కాదు. హీరోయిన్ గా రాణించి పెళ్లి చేసుకున్నాకా కూడా అలాంటి లైఫ్ నే కోరుకొనే అమ్మాయి కాదు. చక్కగా పెళ్లి చేసుకొని తిరుపతిలో భర్తతో సెటిల్ అయ్యి గృహిణిగా, తల్లిగా బాధ్యతలు తీసుకోవాలని కోరుకుంటుంది.


జాన్వీ ఎప్పుడు పెళ్లి గురించి చెప్పినా అదే మాట చెప్పుకొస్తుంది. బోనీ కపూర్ కూడా శిఖర్ తోనే జాన్వీ పెళ్లి అంటూ ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. అందుకే కాబోలు అమ్మడు తమ ప్రేమ వ్యవహారాన్ని ప్రతిసారి ఎంతో డిఫరెంట్ గా బహిర్గతం చేస్తూ వస్తుంది. తాజాగా జాన్వీ.. తన ప్రేమను మరోసారి పబ్లిక్ లో చూపించేసింది.ఇటీవల జాన్వీ, శిఖర్ కలిసి కనిపించారు. అయితే ఈసారి జాన్వీ షర్ట్ పై ఏకంగా శిఖర్ ఫోటోలు ప్రింట్ అయ్యి కనిపించాయి. శిఖర్ ఫొటోలతో కస్టమైజ్ చేయించిన టీ షర్ట్ ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. అందులో శిఖర్ షర్ట్ లెస్ ఫోటో కూడా ఉండడం విశేషం. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. జాన్వీ ప్రేమ మాయలో పడిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 06:17 PM