Janhvi Kapoor: తల్లి సినిమా.. రీమేక్‌లో తనయ! ఇదైనా హిట్ తెచ్చేనా
ABN, Publish Date - Sep 01 , 2025 | 06:41 PM
తాజాగా.. ఓ కల్ట్ చిత్రం రిమేక్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.
తాజాగా.. ఓ కల్ట్ చిత్రం రిమేక్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. నాలుగు దశాబ్దాల క్రితం శ్రీదేవి (Sridevi) కథానాయికగా నటించిన బాలీవుడ్ చిత్రం ‘చాల్‌బాజ్’ (ChaalBaaz). 1989లో వచ్చిన ఈ సినిమాకు పంకజ్ పరాశర్ దర్శకత్వం వహఙంచగా రజనీకాంత్ (Rajinikanth), సన్నీ డియోల్ (Sunny Deol) హీరోలుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు లభించింది. శ్రీదేవి కెరీర్‌ను ఓ మలుపు తిప్పడమే కాక నటీనటులకు పేరుతో పాటు అనేక అవార్డులు సైతం తెచ్చి పెట్టింది.
అయితే.. ఇప్పుడు ఈ సినిమా రిమేక్ చేస్తున్నారనే వార్త రెండు రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ రీమేక్‌లో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వైరల్‌గా మారాయి. ఇదిలాఉంటే.. తన తల్లి శ్రీదేవి సినిమాల్లో తనకు ఇష్టమైన చిత్రం ‘చాల్‌బాజ్’ అని చెప్పే జాన్వీ ఇప్పుడు అదే సినిమా రీమేక్‌లో నటించే అవకాశం రావడంపై పట్టలేనంత సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరు? రీమేక్ కథలో ఎలాంటి మార్పులు చేస్తారు? అన్న విషయంలో ఈ నెలాఖరున ఓ అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.