War 2: కియారా బికినీ సీన్స్ కట్ చేశారా.. ఇదెక్కడి అన్యాయం
ABN, Publish Date - Aug 10 , 2025 | 07:08 PM
కొందరు సినిమా కథ కోసం చూస్తారు.. ఇంకొందరు హీరో కోసం చూస్తారు.. మరికొందరు ఎంటర్ టైన్మెంట్ కోసం చూస్తారు.. అయితే కుర్రకారు మాత్రం సినిమాలను హీరోయిన్ అందాల కోసం చూస్తారు.
War 2: కొందరు సినిమా కథ కోసం చూస్తారు.. ఇంకొందరు హీరో కోసం చూస్తారు.. మరికొందరు ఎంటర్ టైన్మెంట్ కోసం చూస్తారు.. అయితే కుర్రకారు మాత్రం సినిమాలను హీరోయిన్ అందాల కోసం చూస్తారు. సినిమా అన్నాక అన్ని ఉండాలి. అందులో బాలీవుడ్ అంటే బికినీ సీన్స్ తప్పకుండా ఉండాలి. ఇక ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ కూడా ఎదురుచూస్తున్న సినిమా వార్ 2. హృతిక్ రోషన్(Hritik Roshan),ఎన్టీఆర్ (NTR) మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 14 న రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇక ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వార్ 2 సినిమాను ఎందుకు చూడాలి అనే ప్రశ్న వస్తే.. కొందరు హృతిక్ కోసం అంటే.. కొందరు ఎన్టీఆర్ కోసం అంటారు.. కానీ, చాలామంది కియారా బికినీ సీన్స్ కోసం అని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో హృతిక్ సరసన కియారా రొమాన్స్ చేసింది. ఇక సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే కియారా బికినీ సాంగ్ మరో ఎత్తు. 12 సెకన్ల నిడివి ఉన్న ఈ సీక్వెన్స్ ను కియారా ఒరిజినల్ గా చేసిందంట. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఇంత హాట్ బికినీ సీక్వెన్స్ లేదని మాట్లాడుకుంటున్నారు.
వార్ 2 సినిమాను కియారా బికినీ సీన్స్ కోసమైనా చూడాలి అనుకునేవారికి సెన్సార్ షాక్ ఇచ్చింది. వార్ 2 లో కియారా సీన్స్ కు కట్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ బీచ్ సాంగ్ లో కియారా బికినీ సీక్వెన్స్ 12 సెకన్ల నుంచి 9 సెకన్ల వరకు కట్ చేశారని సమాచారం. అందులో కూడా కియారా లాంగ్ షాట్స్ మాత్రమే ఉండేలా జాగ్రత్త పడ్డారని టాక్. ఈ విషయం తెలియడంతో కియారా అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. అసలు తాము వెళ్లేదే కియారా కోసం అయితే ఇప్పుడు ఇందులో కూడా కోతలు అంటే వార్ 2 కి వెళ్లడం ఎందుకు అని నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. కియారా సీన్స్ పెట్టాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
మరి ఇందులో ఎంత నిజం ఆ ఏది తెలియదు కానీ, ఇదే కనుక నిజమైతే వార్ 2 సినిమాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. మొదటి నుంచి వార్ 2 కి తెలుగులో అంతగా ప్రమోషన్స్ లేవు. ఎన్టీఆర్ సైతం అస్సలు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఆగస్టు 14నే వార్ 2 తో పాటు కూలీ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. కూలీ ప్రపంచవ్యాప్తంగా హైప్ తెచ్చుకుంటుంది. దాంతో పోలిస్తే వార్ 2 కి హైప్ తక్కువే అని చెప్పొచ్చు. ఇక సినిమాకు ప్రేక్షకులను రప్పించే సీన్స్ కూడా లేవు అంటే వార్ 2 హిట్ అవ్వడం కొద్దిగా కష్టమే అని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి కూలీ తో పోటీపడి వార్ 2 గెలుస్తుందా లేదా చూడాలి.
The Raja Saab: రీషూట్ల మీద రీషూట్లు.. హిట్ పడుతుందా..
Ustaad Bhagat Singh Update: హరీశ్ స్పీడ్ మామూలుగా లేదుగా.. అప్పుడే మొదలెట్టేశాడు..