సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Twelfth Fail: ట్వల్త్‌ ఫెయిల్‌ కాదు

ABN, Publish Date - Aug 02 , 2025 | 06:21 AM

ఎన్నో అవమానాలు, మరెన్నో విమర్శలు మధ్య నిజాయితీగా గెలిచిన విజయవంతమైన చిత్రం ‘ట్వల్త్‌ ఫెయిల్‌’. ‘ఈ ఏడాది మీరు

ఎన్నో అవమానాలు, మరెన్నో విమర్శలు మధ్య నిజాయితీగా గెలిచిన విజయవంతమైన చిత్రం ‘ట్వల్త్‌ ఫెయిల్‌’. ‘ఈ ఏడాది మీరు కేవలం ఒకే ఒక్క సినిమా చూడదలుచుకుంటే కచ్చితంగా ‘ట్వల్త్‌ ఫెయిల్‌’ చూడండి’ అంటూ ఆ చిత్రం విడుదలైన సమయంలో పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా నెటిజన్లకు సూచించారు. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారానికి అర్హమైన నటనను కనబరచారు అంటూ అప్పట్లోనే ఆయన విక్రాంత్‌ మాస్సేను అభినందించారు కూడా. ఇప్పుడు ఆయన అంచనా నిజమైంది. ‘ట్వల్త్‌ ఫెయిల్‌’ ఉత్తమ జాతీయ చిత్రంగా నిలవగా, విక్రాంత్‌ మాస్సేకు ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. పన్నెండో తరగతి ఫెయిలైనా పట్టుదలతో సివిల్స్‌ సాధించి ఐపీఎ్‌సకు సెలెక్టయ్యారు మనోజ్‌కుమార్‌ శర్మ. ఆయన జీవిత కథ ఆధారంగా అనురాగ్‌ పాఠక్‌ రాసిన పుస్తకం ‘ట్వల్త్‌ ఫెయిల్‌’. అదే పేరుతో రూపుదిద్దుకున్న చిత్రమిది. పన్నెండో తరగతి తప్పిన యువకుడు సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకోవడం, ఆ క్రమంలో మనోజ్‌కు ఎదురైన సవాళ్లను స్ఫూర్తిదాయకంగా తెరపైన ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు విధు వినోద్‌ చోప్రా 13 ఏళ్ల విరామం తర్వాత ‘ట్వల్త్‌ ఫెయిల్‌’ కోసం మళ్లీ మెగాఫోన్‌ పట్టారు. అంతేకాదు కథ, నిర్మాణం, ఎడిటింగ్‌ బాధ్యతలను తన భుజాన వేసుకున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 06:21 AM