Krish 4: బాలీవుడ్ సూపర్‌హీరో ఫ్రాంచైజీకి కొత్త అధ్యాయం – క్రిష్ 4

ABN , Publish Date - Sep 09 , 2025 | 02:03 PM

Krrish 4 update Hrithik Roshan Krrish 4 Bollywood superhero movies Hrithik Roshan directorial debut

Krish 4 Update

బాలీవుడ్‌ సూపర్‌హీరో ఫ్రాంచైజీ ‘క్రిష్‌’కు కొనసాగింపుగా మరో చిత్రం రాబోతుంది. ఇప్పుడు 'క్రిష్‌-4' (Krish 4) చిత్రానికి సర్వం సిద్ధమైంది. అయితే ఈసారి మరో ప్రత్యేకత ఉంది. ఈ చిత్రంలో తాను హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగానూ పరిచయం కాబోతున్నారు హృతిక్‌ రోషన్‌(Hrithik Roshan) . క్రిష్‌ సిరీస్‌ చిత్రాలను తెరకెక్కించిన రాకేశ్‌ రోషన్‌ (Rakesh Roshan) ఈసారి దర్శకత్వ బాధ్యతలను తన కుమారుడికే అప్పగించారు. హృతిక్‌కు దర్శకుడిగా తొలి చిత్రమిది. ఈ విషయాన్ని రాకేశ్‌ రోషన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈ మాసీవ్‌ అప్‌డేట్‌ బాలీవుడ్‌లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఇప్పటికే వచ్చిన క్రిష్‌ ఫ్రాంఛైజీ చిత్రాలు ఎంతగా విజయం సాధించాయో తెలిసిందే. ఇప్పుడు రాబోతున్న నాలుగో చిత్రం అంతకు మించి ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం కథ కోసం అంతగా కష్టపడలేదనీ, బడ్జెట్‌ విషయంలోనే కాస్త ఆలోచించాల్సి వచ్చిందని తెలిపారు. భారీతనంలో కూడిన ఈ చిత్రం నిర్మాణానికి హై బడ్జెట్‌ అవుతుందని, ఆ పనులు కొలిక్కి రాగానే షూటింగ్‌ మొదలువుతందని రాకేశ్‌ రోషన్‌ వెల్లడించారు.

హృతిక్‌ మాత్రమే..

‘ఈ కథను హృతిక్‌ బాగా అర్థం చేసుకున్నాడు. అతను మాత్రం ఈ చిత్రాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లగలదు. ఈసారి హృతిక్‌ ఇందులో త్రిపాత్రాభినయం చేయబోతున్నాడు. క్రిష్‌ గత సిరీసుల్లో నటించిన ప్రియాంక చోప్రా, ప్రీతి జింతా, రేఖ, వివేక్‌ ఒబెరాయ్‌ నటించే అవకాశం ఉంది. ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు మొదలయ్యాయి. 2026 ప్రథమార్ధంలో షూటింగ్‌ మొదలుపెట్టి 2027లో సినిమాను విడుదల చేసే దిశగా ప్రణాళిక సిద్దం చేశాం’ అని రాకేశ్‌ రోషల్‌ తెలిపారు.

లెగసీ కంటిన్యూ చేస్తా..

క్రిష్‌ 4 కేవలం సూపర్‌హీరో సినిమా మాత్రమే కాదు. ఇదొక ఫ్యామిలీ లెగసీ. నటుడిగానే కాక దర్శకుడిగా నిరూపించుకోవడానికి ఇదొక గోల్డెన్‌ ఛాన్స్‌ నాకు. ఈ సినిమా నాకు బాధ్యతే కాదు. సవాల్‌ కూడా. అభిమానులు సపోర్ట్‌ ఉంటే ఈ లెగసీని మింకా ముందుకు తీసుకెళ్లగలను’ అని హృతిక్‌ రోషన్‌ అన్నారు.

READ ALSO: Allu Arjun: అల్లు అర్జున్.. ఫ్యామిలీకి బ‌ల్దియా షాక్!

Telusu Kada: తెలుసు క‌దా.. టీజ‌ర్ వ‌చ్చేస్తుంది! ఎప్పుడంటే



Updated Date - Sep 09 , 2025 | 02:14 PM