Telusu Kada: తెలుసు కదా.. టీజర్ వచ్చేస్తుంది! ఎప్పుడంటే
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:29 PM
జాక్ వంటి డిజాస్టర్ తర్వాత స్టార్ బాయ్ టిల్లు సిద్దు జొన్నలగడ్డ నటించిన చిత్రం తెలుసు కదా.
జాక్ వంటి డిజాస్టర్ తర్వాత స్టార్ బాయ్ టిల్లు సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) నటించిన చిత్రం తెలుసు కదా (Telusu Kada). రాశీ ఖన్నా (Raashii Khanna), శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty)కథానాయికలు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన (Neerajaa Kona) దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తోంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) నిర్మిస్తోంది. రెండేడ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్లు, పాటలు, గ్లిమ్స్, ఇతర ప్రమోషన్ కార్యక్రమాలు ఈ చిత్రంపై ఆడియన్స్ నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. పాటలు సైతం మంచి జనాధరణ పొందాయి.
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ మంగళవారం ఓ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ (Telusu Kada Teaser)ను 11వ తారీఖు గురువారం రోజున సరిగ్గా 11 గంటల 11 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఓ వైపు హీరో.. మరో వైపు ఇద్దరు హీరోయిన్లు కలిసి ఉన్న పోస్టర్‌ను వదిలారు. టిల్లు వంటి వరుస హిట్ల తర్వాత జాక్ సినిమా ఇచ్చిన ఫలితం సిద్ధు కేరీర్‌కు ఎఫెక్ట్ చేసేదిగా మారడంతో ఆయన ఆశలన్నీ ఇప్పుడు ఈ చిత్రంపైనే ఉన్నాయి. ఇదిలాఉంటే ఈ మూవీ ఆక్టోబర్ 17న తెలుగు, తమిళ కన్నడ భాషల్లో విడుదల కానుంది.