Hrithik Roshan - War 2: తారక్‌ని గమనించా.. నేర్చుకున్నా.. అదే ఫాలో అవుతా..
ABN, Publish Date - Aug 10 , 2025 | 09:23 PM
‘తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మనమంతా బ్రదర్స్. ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. మీ అభిమానానికి, మీ ఆహ్వానానికి ఫిదా అయిపోయాను. యంగ్ టైగర్ ప్యాన్స్ గర్జన వినడానికి ఇక్కడికి వచ్చాను.
'ఈ సినిమా జర్నీలో తారక్‌ను గమనించడమే కాదు.. అతని నుంచి చాలా నేర్చుకున్నా. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అతను. వంద శాతం పెర్‌ఫెక్షన్‌తో షాట్‌కి ఎలా వెళ్లాలో తారక్‌ని తారక్ నుంచి నేర్చుకున్నా. నా తదుపరి చిత్రాలకు అతని ఫార్ములానే ఫాలో అవుతా’ అని హృతిక్ రోషన్ (Hrithik Roshan) అన్నారు. ఆయన కథానాయకుడిగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన చిత్రం ‘వార్-2’. జూ.ఎన్టీఆర్ (Jr Ntr) ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడక జరిగింది(War 2).
హృతిక్ రోషన్ మాట్లాడుతూ ‘‘కొన్నేళ్ల క్రితం ‘క్రిష్’ సినిమా కోసం ఇక్కడికొచ్చాను. ఇక్కడి హాస్పటాలిటీ, వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్, తెలుగులు చూపించిన ప్రేమ నాకెంతో నచ్చింది. నాలుగులో రోజుల్లో సినిమా వస్తుంది. యుద్దానికి రెడీగా ఉన్నారా?’ అంటూ అభిమానులో ఉత్సాహం రేకెత్తించారు.
తారక్‌ని చూశాక ఆ పెయిన్ కూడా లేదు..
‘తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మనమంతా బ్రదర్స్. ఒకే కుటుంబానికి చెందినవాళ్లం. మీ అభిమానానికి, మీ ఆహ్వానానికి ఫిదా అయిపోయాను. యంగ్ టైగర్ ప్యాన్స్ గర్జన వినడానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరిని ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. 25 ఏళ్ల నా కెరీర్‌లో కొన్ని పాత్రలు నన్ను ఓ రేంజ్‌కి తీసుకెళ్లాయి. ‘వార్స్ -2’ మాత్రం టాప్‌లో ఉంటుంది. ఇందులో నేను పోషించిన కబీర్ పాత్రతో అందరూ లవ్‌లో పడతారు. అలాగే నా బ్రదర్ తారక్ నటన చూసి మరింత లవ్ చేస్తారు. యాక్షన్ సినిమాల కోసం మేం ఎంతో కష్టపడతాం. దెబ్బలు తగులుతాయి. నొప్పిని భరిస్తాం. నేను బాధతో విలవిలలాడుతుంటే, ఎన్టీఆర్ మాత్రం ఆ బాధను పంటి బిగువున పెట్టుకుని సీన్స్ చేశారు. ఈ సినిమా కోసం తారక్ చూపించిన డెడికేషన్, అతను పడిన కష్టం చూసి నాకు షూటింగ్‌లో పెయిన్ తెలియలేదు. ఈ జర్నీలో తారక్‌ను ఎంతో అబ్జర్వ్ చేశా. అతనిలో నన్ను నేను చూసుకున్నా. నాలోనూ తారక్ కనిపించాడు. సినీ రంగంలో మా ఇద్దరిదీ 25 ఏళ్ల జర్నీ. ఇండస్ర్టీలు వేరైనా ఇద్దరిదీ సింపుల్ జర్నీ. అతనిలో నేను బాగా గమనించిన విషయం ఏంటంటే.. ఒక టేక్ చేస్తాడు.. అదే ఫైనల్ అవుతుంది. (వన్ టేక్.. ఫైనల్ టేక్ స్టార్). తారక్‌ను గమనించడమే కాదు.. అతని నుంచి చాలా నేర్చుకున్నా. 99.99 శాతం కాదు వంద శాతం పెర్‌ఫెక్షన్‌తో షాట్‌కి ఎలా వెళ్లాలో తారక్‌ని చూసి నేర్చుకున్నా. సీన్ పండటం కోసం ఏమైనా చేసేస్తాడు. తీసిన సీన్ ఎలా వచ్చిందో చెక్ చేసుకోడు. ఎందుకంటే అది బాగా వస్తుందని అతనికి తెలుసు. అదే నేను తారక్ నుంచి నేర్చుకున్నా. నా తదుపరి చిత్రాలకు అతని ఫార్ములానే ఫాలో అవుతా. ఆయన మంచి నటుడే కాదు.. మంచి చెప్ కూడా. అతను చేసే బిర్యానీ అంటే నాకెంతో ఇష్టం’ అని అన్నారు.