Hrithik Roshan: ఆ ఫలితం నాకు తెలిసింది.. మీరూ ట్రై చేయండి..
ABN, Publish Date - Aug 05 , 2025 | 04:02 PM
కనీసం ఓ వారం పాటు సోషల్ మీడియాకు (Social media) దూరంగా ఉండటానికి ప్రయత్నించాలని ప్రజలను కోరారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్
కనీసం ఓ వారం పాటు సోషల్ మీడియాకు (Social media) దూరంగా ఉండటానికి ప్రయత్నించాలని ప్రజలను కోరారు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan). ఈ నెల 14న ‘వార్ 2’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్నారాయన. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. టీమ్‌తో కలిసి సరదాగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గతంలో తాను సోషల్ మీడియాకు బ్రేక్ ఇవ్వడంపై స్పందించారు.
‘మనకున్న పనుల్ని సైతం పక్కన పెట్టి ఆన్‌లైన్‌లో ఉండడం వల ఎంత నష్టమో అర్థం చేసుకున్నాను. అందుకే ఆయా యాప్‌లను కొన్ని రోజులని తొలగించాను. ఇన్‌స్టాగ్రామ్‌ను డీయాక్టివేట్ చేశాను. అందరికీ ఇచ్చే సలహా ఒక్కటే.. కనీసం ఒక వారమైనా అన్నిటికీ దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. నేను ప్రయత్నించాను. దాని ద్వారా ఎలాంటి ఫలితం దక్కిందో చూశాను. అందుకే చెబుతున్నాను. మన సమయం ఎంతో ఆదా అవుతుంది. ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’ అని అన్నారు.
'వార్ -2' చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఇందులోని ‘ఊపిరి ఊయలగా’ అనే పాటను ఇటీవల విడుదల చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హృతిక్, కియారా అడ్వాణీల మధ్య రొమాంటిక్‌గా సాగిన ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కియారాతో కలిసి డ్యాన్స్ చేయడానికి కష్టపడినట్లు హృతిక్ తెలిపారు. చాలా ప్రాక్టీస్ చేసినప్పటికీ షూట్‌లో ఎన్నోటేక్ తీసుకున్నానని చెప్పారు.