Jr NTR War 2: షూటింగ్ పూర్తి... హృతిక్ ఎమోషనల్ పోస్ట్
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:14 PM
వార్ 2 మూవీ షూటింగ్ పూర్తయిన సందర్భంగా హృతిక్ రోషన్ తన ఎమోషన్స్ ను పోస్ట్ ద్వారా తెలియచేశాడు. అంతేకాదు 'వార్ 2' బృందానికి హృతిక్ డిన్నర్ పార్టీ కూడా ఇచ్చాడు.
బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan), మాస్టర్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబోతో తెరకెక్కుతున్న 'వార్ 2' (War -2)మూవీ షూటింగ్ పూర్తయ్యింది. పాట చిత్రీకరణతో ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరినీ భలే ఆకట్టుకుంటోంది.
'వార్ 2' సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మిక్స్డ్ ఫీలింగ్స్ తో ఉన్నానని హృతిక్ తన పోస్ట్ లో చెప్పుకోచ్చాడు. 149 రోజుల పాటు జరిగిన ఈ షూటింగ్ ను తలుచుకున్నాడు. ఛేజ్, యాక్షన్, డాన్స్, రక్తం, చెమట, గాయాలు... ఇలా అన్నింటినీ ఆస్వాదించానని, అవన్నీ కూడా వర్త్ వాచింగ్ మూవీకి దారి తీశాయని తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాని, తామిద్దరూ కలిసి వర్క్ చేయడం సమ్ థింగ్ స్పెషల్ అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో కియారా అద్వానీలోని మరో కోణాన్ని జనాలు చూస్తారని హృతిక్ ఊరించాడు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణమైన నిర్మాత ఆదిత్య చోప్రా, దర్శకుడు అయాన్ ముఖర్జీని హృతిక్ పొగడ్తలతో ముంచెత్తాడు. మొత్తం 'వార్ -2' టీమ్ కు హృతిక్ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాడు. తాను పోషించిన కబీర్ పాత్రను వీడి వెళ్ళడమనేది తనకు ఓ తీయని బాధను కలిగిస్తుందని, మళ్ళీ మామూలు మనిషి కావడానికి కొద్ది రోజుల సమయం పడుతుందని కవితాత్మకంగా హృతిక్ తెలిపారు. ఆగస్ట్ 14న రాబోతున్న ఈ సినిమాను చూడాల్సిందిగా కోరాడు.
'వార్ -2' మూవీ షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా హృతిక్ తన ఇంటికి ఎన్టీఆర్, మృణాల్, అయాన్, ఆదిత్యతో పాటు యశ్ రాజ్ ఫిలిమ్స్ టీమ్ ను కూడా ప్రైవేట్ డిన్నర్ పార్టీకి పిలవడం విశేషం.
Also Read: Rashmika Mandanna: కొత్త అవతారంలో.. షాకిచ్చిన నేషనల్ క్రష్
Also Read: Shruti Haasan: నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలను కుంటున్నాను..