Rashmika Mandanna: కొత్త అవ‌తారంలో.. షాకిచ్చిన‌ నేష‌న‌ల్ క్ర‌ష్

ABN , Publish Date - Jul 08 , 2025 | 05:27 PM

టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న‌ రష్మిక ఫ్యాషన్ ఫీల్డ్‌లో సంచలనం సృష్టిస్తోంది.

Rashmika Mandanna

ప్ర‌స్తుతం ఇండియాలో ఏ క‌థానాయిక సాధించ‌లేని విధంగా వ‌రుస భారీ సినిమాల‌తో, అంత‌కు మించి విజ‌యాల‌తో దూసుకుపోతోంది క‌న్న‌డ క‌స్తూరి రష్మిక మంద‌న్నా (Rashmika Mandanna). యానిమ‌ల్, పుష్ఫ‌2, ఛావా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌ చిత్రాల‌తో రూ.600 కోట్ల‌కు వ‌సూళ్లు సాధించిన సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించి ఇత‌రుల‌కు సాధ్యం కానీ రికార్డ్‌ను త‌న కాతాలో వేసుకుంది. ఇటీవ‌ల కుబేర సినిమాతోనూ అక‌ట్టుకున్న ఈ ముద్దుగుమ్మ హ‌వా అంత‌కంత‌కు పెరుగుతూ జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో మీడియాల్లో ప్ర‌ముఖంగా నిలుస్తూ వ‌స్తోంది.

ఓ వైపు చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌ష్మిక‌.. ఫ్యాషన్ ఫీల్డ్‌లో కూడా సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఓ డర్టీ క‌ట్ (DirtyCut 2025) అనే ప్రముఖ మ్యాగజైన్ ఎడిటోరియల్ ఎడిషన్ కోసం స్టైలిష్‌గా న్యూ అవ‌తార్‌లో ద‌ర్శ‌ణ‌మిచ్చింది. ఈ కొత్త అవతార్‌లో ఆమెని చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. ట్రెడిషనల్ గ్లామర్‌కు భిన్నంగా, బోల్డ్, ఎడ్జీ అవుట్‌ఫిట్స్, విభిన్న హేర్ స్టైల్, హై ఫ్యాషన్ కలగలిపిన ఈ లుక్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోషూట్‌లో రష్మికను చూస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేంత‌గా ఉండి ఎవ‌రీ చిన్న‌ది అని అనుకునేలా ఆ లుక్ ఉంది.

Rashmika Mandanna

ఇదిలాఉంటే ర‌ష్మిక ఇటీవ‌ల‌ న‌టించిన తెలుగు చిత్రం కుబేర బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌గా తెలుగులో కొత్త‌గా మైసా ‘Maisa’ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో పాటు చిల‌సౌ ఫేమ్ , యాక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ది గ‌ర్ల్‌ఫ్రెండ్ ‘The Girlfriend’ షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. ఇవే కాకుండా, బాలీవుడ్‌లో పలు కొత్త ప్రాజెక్టులు కూడా లైన్‌లో ఉన్నాయి.

Updated Date - Jul 08 , 2025 | 05:27 PM