Adah Sharma: హీరోయిన్ అదా శర్మ ఇంట తీవ్ర విషాదం..
ABN, Publish Date - Nov 23 , 2025 | 06:13 PM
హీరోయిన్ అదా శర్మ(Adah Sharma) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదా శర్మ నానమ్మ తులసీ నాయర్ మృతి చెందారు.
Adah Sharma: హీరోయిన్ అదా శర్మ(Adah Sharma) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదా శర్మ నానమ్మ తులసీ నాయర్ మృతి చెందారు. గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న తులసీ నాయర్.. నేటి ఉదయం 5 గంటలకు మృతిచెందినట్లు తెలుస్తోంది. దీంతో అదా శర్మ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అదా ఎక్కువ నాన్నమ్మ దగ్గరే పెరిగింది. సోషల్ మీడియాలో ఎక్కువ ఆమెతోనే అదా శర్మ వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటుంది. మనవరాలి కోసం తులసీ నాయర్ కూడా ఎంతో యాక్టివ్ గా వీడియోల్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తుంది. నాన్నమ్మ మరణంతో అదా శర్మ చాలా కృంగిపోయింది. ఈ విషయం తెల్సుకున్న పాసులువురు ప్రముఖులు, అభిమానులు తులసీ నాయర్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
అదా శర్మ.. హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. తెలుగులో అవాకాశాలను అందుకున్నా విజయాలను మాత్రం ఈ చిన్నది అందుకోలేకపోయింది. దీంతో బాలీవుడ్ లోనే పాగా వేసింది. ది కేరళ స్టోరీ సినిమా అమ్మడి జీవితాన్నే మార్చేసింది. ఇక దీని తరువాత బస్తర్ సినిమాతో వచ్చింది. వివాదాస్పద సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అదా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.