సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Swara Bhasker: సమాజంలో చాలా సమస్యలున్నాయి.. వాటిపై దృష్టి పెట్టండి..

ABN, Publish Date - Aug 23 , 2025 | 04:03 PM

సమాజం, సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై తరచూ స్పందిస్తుంటారు నటి స్వరా భాస్కర్‌(Swara Bhaskar). తాజాగా ఆమె మరోసారి వార్తలో నిలిచారు.

Swara Bhaskar


సమాజం, సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై తరచూ స్పందిస్తుంటారు నటి స్వరా భాస్కర్‌(Swara Bhaskar). తాజాగా ఆమె మరోసారి వార్తలో నిలిచారు. ఎంపీ డింపుల్‌ యాదవ్‌పై క్రష్‌ (crush on Dimple yadav) ఉందని ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన సమాధానం నెట్టింట వైరల్‌ అవుతుంది. సంబంధిత వీడియో క్లిప్‌ కొన్ని రోజులుగా ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. సమాజంలో మంచి పేరున్న వ్యక్తి గురించి అలా ఎలా మాట్లాడతారంటూ స్వరా భాస్కర్‌పై  విమర్శలొచ్చాయి. దీనిపై తాజాగా నేషనల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వరా భాస్కర్‌ మాట్లాడుతూ ఓట్ల చోరీ లాంటి పెద్ద సమస్యలు ఎన్నో ఉన్నాయని, వాటి గురించి మాట్లాడితే సొసైటీకి ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. దేశంలో నెలకొన్న సమస్యలపై దృష్టిపెట్టాలని ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇచ్చారు. ఈ మధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వతహాగా మనుషులంతా బైసెక్సువల్స్‌ అని పేర్కొంది. దానిపై కూడా విమర్శలు వచ్చాయి.

ALSO READ: Mirai: హనుమాన్ హీరోకు పెద్ద సమస్యే వచ్చి పడిందే

‘గత ఇంటర్వ్యూలో బైసెక్సువల్‌ గురించి నా అభిప్రాయం చెప్పా. అది అంతగా ఎందుకు వైరల్‌ అయిందో అర్థం కాలేదు.  నేను తప్పుగా ఏం మాట్లాడలేదు. అయినా నా ఆలోచన చెప్పా తప్ప ప్రాక్టికల్‌గా అవుతుందని కాదు కదా. నాకు పెళ్లి అయింది. ఓ పాప కూడా ఉంది. ఇక డింపుల్‌ విషయానికొస్తే.. ఆమె అందంగా ఉంటుంది. చాలా మందికి స్ఫూర్తి. ఆమె రాజకీయ నాయకుడి (యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ భార్య) సతీమణి. ఆమె కూడా రాజకీయాల్లో ఉంది. డింపుల్‌ను నేనెప్పుడూ ఆరాధిస్తుంటా. ఆ కోణంలోనే నేను మాట్లాడాను’ అని అన్నారు. ఈ కాంట్రవర్సీ గురించి డింపుల్‌తో మాట్లాడారా? అని ప్రశ్నించగా లేదని డింపుల్‌ సమాధానమిచ్చారు. ‘ఇదంత పెద్ద విషయం కాదు. డింపుల్‌, ఆమె కుటుంబసభ్యులు పరిణతి కలిగిన వారు. అర్థం చేసుకుంటారని నా నమ్మకం’ అని అన్నారు.


ALSO READ: Pradeep Ranganathan: దీపావళి రేస్ లో రెండు సినిమాలు

Chiranjeevi: మరోసారి చేతులెత్తేసిన 'స్టాలిన్'



Updated Date - Aug 23 , 2025 | 04:06 PM