సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Zubeen Garg: సింగ‌ర్‌ జూబిన్ గార్గ్‌ క‌డచూపు కోసం.. పోటెత్తిన అభిమానులు! సంద్రాన్ని త‌ల‌పించిన వీధులు

ABN, Publish Date - Sep 22 , 2025 | 11:36 AM

అసోం ప్రముఖ గాయకుడు జూబిన్ గార్గ్ మృతి. గౌహతీ వీధుల్లో అభిమానులు చివరి వీడ్కోలు పలుకుతూ, పూలతో గౌరవం తెలిపారు.

Zubeen Garg

అసోం రాష్ట్రానికి చెందిన‌ ప్రముఖ గాయకుడు జూబిన్ గార్గ్ (Zubeen Garg) సింగపూర్ (Singapore)లో ఈత కొట్టే స‌మ‌యంలో జ‌రిగిన ప్రమాదంలో మృతి చెందడం యావ‌త్ భార‌త‌ సంగీత ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన విష‌యం తెలిసిందే. సెప్టెంబర్ 19న యాచ్ట్ ట్రిప్‌లో స్కూబా డైవింగ్ చేస్తున్న‌ సమయంలో ఆయన లైఫ్ జాకెట్ తీసేయడంతో నీటిలో మునిగి పోయారు. వెంటనే సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై అత‌నిని ఆసుపత్రికి తరలించినా డాక్ట‌ర్లు ప్రాణాలు కాపాడ‌లేక పోయారు.

ఆపై అక్క‌డి పార్మాలిటీస్ పూర్తి చేసి గార్గ్ భౌతిక కాయాన్ని ఇండియాకు ప్ర‌త్యేక విమానంలో త‌ర‌లించారు. సింగపూర్ నుంచి ఢిల్లీకి చేరిన ఆయన మృతదేహాన్ని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ స్వయంగా స్వీకరించారు. ఆయనతో పాటు కేంద్ర సహాయ మంత్రి పబిత్ర మార్గరెటా, పలువురు అధికారులు కూడా హాజరయ్యారు.


గౌహతీ వీధుల్లో.. జనం తాకిడి

అయితే.. జూబిన్ మృతదేహం స్వదేశానికి చేరుకోగానే గౌహతీ వీధులు అభిమానులతో నిండిపోయాయి. ఆయనకు చివరి వీడ్కోలు పలకడానికి ల‌క్ష‌లాది మంది ఫ్యాన్స్ ఇంకా చెప్పాలంటే ఇసుక వేస్ంతే రాల‌నంత సంఖ్య‌లో అభామానులు రోడ్లపైకి వచ్చారు. కన్నీళ్లతో ఆయన పాటలు పాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా ఆయన చివ‌రి కోరిక మేర‌ ‘మాయా బిని’ పాటను ఆలపించడం అందరినీ కంటతడి పెట్టించింది.

మ‌రోవైపు. .జూబిన్ గార్గ్ మృతదేహాన్ని తీసుకువెళ్తున్న అంబులెన్స్‌పై అభిమానులు పూల వర్షం కురిపించారు. ఆయనకు గౌరవంగా అనేక ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. మొదట ఆయన మృతదేహాన్ని ఇంటికి చేర్చి ప్రజలకు చివరి చూపు చూపించారు. అనంతరం అర్జున్ భోగేశ్వర్ బరువా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు తరలించి ప్రజల సంద‌ర్శ‌ణార్థం ఉంచారు. సెప్టెంబ‌ర్ 23 మంగ‌ళ‌వారం రోజున ప్ర‌భుత్వ అధికారిక లాంఛ‌నాల‌తో గౌహ‌తి (Guwahati) స‌మీపంలోని సోనాపూర్ (Sonapur)లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అస్సాం ప్ర‌భుత్వం డిక్లేర్ చేసింది.

తెలుగులోనూ ..

ఇదిలాఉంటే.. జుబిన్ గార్గ్ (Zubeen Garg)కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ఆయ‌న గ‌తంలో రామ్ పోతినేని (Ram) హీరోగా న‌టించిన మ‌స్కా (Maska) సినిమాలో దివంగ‌త చ‌క్రి సంగీత ద‌ర్శ‌క‌త్వంలో గుండె గోదారిలా (Gunde Godarila) అనే పాట‌తో పాటు, మ‌రో ప్ర‌ముఖ‌ సింగ‌ర్ స్మిత (Smita)తో క‌లిసిస‌న్న‌జాజి ప‌డ‌కా (Sannajaji Padaka) అనే రీమిక్స్ పాట‌ను సైతం ఆల‌పించ‌డం గ‌మ‌నార్హం.

Updated Date - Sep 22 , 2025 | 11:49 AM