Aamir Khan: రాఖీ రోజున అన్నపై సంచలన ఆరోపణలు చేసిన ఆమీర్ సోదరుడు
ABN, Publish Date - Aug 09 , 2025 | 07:19 PM
నేడు దేశమంతటా ప్రజలందరూ రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తోడబుట్టినవాళ్లను గుర్తుచేసుకొని వారికి రాఖీలు కడుతూ సంబురాలుచేసుకుంటున్నారు.
Aamir Khan: నేడు దేశమంతటా ప్రజలందరూ రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. తోడబుట్టినవాళ్లను గుర్తుచేసుకొని వారికి రాఖీలు కడుతూ సంబురాలుచేసుకుంటున్నారు. అయితే ఇలాంటి రోజున ఒక స్టార్ హీరో తమ్ముడు.. తన అన్నపై సంచలన ఆరోపణలను చేశాడు.ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్(Aamir Khan). బాలీవుడ్ డైరెక్టర్ తాహిర్ హుస్సేన్ ఖాన్ కు జన్మించిన నలుగురు కొడుకుల్లో పెద్దవాడు ఆమీర్ ఖాన్, ఆ తరువాత వాడు ఫైసల్ ఖాన్. వీరిద్దరి మధ్య ఏడాది గ్యాప్ ఉండడంతో.. కవల పిల్లలుగా కనిపిస్తారు.
ఫైసల్ కూడా నటుడే. అన్న అంత కాకపోయినా.. అడపాదడపా ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉంటాడు. వీరిద్దరూ కలిసి మేళ అనే సినిమాలో నటించారు. ఇక సినిమాల విషయం పక్కనపెడితే.. ఈమధ్యనే ఫైసల్.. మానసిక వైద్యశాల నుంచి చికిత్స పొంది బయటకు వచ్చాడు. గత కొన్నేళ్లుగా ఆమీర్ కు ఫైసల్ కు మధ్య విభేదాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. తాజాగా ఫైసల్ అన్న ఆమీర్ పై సంచలన ఆరోపణలు చేయడం ఇండస్ట్రీని కుదిపేసింది. ఆమీర్ ఉచ్చులో ఇరుక్కున్నానని, అతడు తనను ఒక ఏడాది పాటు గదిలో బంధించాడని చెప్పుకొచ్చాడు. తన తండ్రి ఆస్తిని కూడా తనకు రాకుండా అతనే అనుభవిస్తున్నాడని ఫైసల్ లీగల్ పోరాటం చేస్తున్నాడు.
' అప్పుడు నాకు మానసిక పరిస్థితి బాలేదని, నేను ఏదేదో తప్పుడు పనులు చేస్తో సమాజానికి హాని తలపెడుతున్నట్లు చెప్పేవారు. నాకు పిచ్చి పట్టిందని, కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని కొట్టేవారు. ఆమీర్ నన్ను ఒక గదిలో ఏడాది పాటు బంధించాడు. ఫోన్ కూడా నా దగ్గర నుంచి లాగేసుకున్నాడు. అప్పుడే అర్ధమయ్యింది అతని ఉచ్చులో నేను కూరుకుపోయాను అని. నా తండ్రికి కాల్ చేసి చెప్పలనుకున్నా కానీ కుదరలేదు. ఆ తరువాత నన్ను ఆమీర్ వేరే ఇంటికి మార్చాడని చెప్పుకొచ్చాడు' ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ ఆరోపణలపై ఆమీర్ ఎలా స్పందిస్తాడో చూడాలి.