Salman Khan: తెరపై మరో రామాయణం.. రాముడిగా సల్మాన్.. సీతగా..
ABN , Publish Date - Jul 21 , 2025 | 04:17 PM
ఇండస్ట్రీలో ప్రస్తుతం మైథలాజికల్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిన విషయం తెల్సిందే. రామాయణం, మహాభారతం కథలను తెలుసుకోవాదానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
Salman Khan: ఇండస్ట్రీలో ప్రస్తుతం మైథలాజికల్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిన విషయం తెల్సిందే. రామాయణం, మహాభారతం కథలను తెలుసుకోవాదానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఆదిపురుష్ (Adipurush) సినిమాతో ప్రభాస్ (Prabhas) రాముడిగా దర్శనమిచ్చాడు. సినిమా విజయం అందుకోలేకపోయినా.. రాముడుగా ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక దీని తరువాత మరోసారి ఇండస్ట్రీని షేక్ చేయడానికి రామాయణ (Ramayana) వస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor)
రాముడిగా.. సాయిపల్లవి సీతగా.. యష్ రావణాసురుడిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇక ఈ రామాయణ మూవీ అనౌన్స్ చేసిన దగ్గరనుంచి సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే రణబీర్ కన్నా ముందు బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో రామాయణం మొదలుపెట్టి ఆపేసాడన్న విషయం తెలుసా.. ? అవునా.. నిజమా.. ? ఎవరా స్టార్ హీరో అని అంటే.. ఇంకెవరు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఈమధ్యకాలంలో కాదు.. 90ల్లోనే సల్మాన్ రామాయణాన్ని ప్రేక్షకులకు చూపించాలనుకున్నాడు.
రాముడిగా సల్మాన్ ఖాన్, సీతగా సోనాలి బింద్రే నటించిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో పూజా భట్ మరో కీలక పాత్రలో నటించింది. దాదాపు 40 శాతం షూటింగ్ కూడా పూర్తి చేశారు. అప్పటికే రాముడిగా సల్మాన్ లుక్ రిలీజ్ అయ్యి మంచి ఆదరణే లభించింది. ఆ సమయంలోనే సోహైల్ కి, పూజా భట్ కు మధ్య ప్రేమాయణం కూడా నడిచింది. ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్.. వారి రిలేషన్ వద్దని గట్టి వార్నింగ్ ఇవ్వడంతో పూజా భట్ ఈ సినిమా నుంచి తప్పుకుంది.
పూజా తప్పుకున్నాక ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, సల్మాన్ రామాయణాన్ని మధ్యలోనే ఆపేశాడు. ఒకవేళ ఈ సినిమా కనుక అప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే భారీ విజయాన్ని అందుకొనేది అని బాలీవుడ్ ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. అప్పట్లో సల్మాన్, సోనాలి జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ ఉండడంతో ఎంతో కొంత నెగిటివిటీ ఏర్పడుతుంది కానీ, అప్పట్లో రాముడిగా సల్మాన్ కనిపిస్తే కచ్చితంగా పూజలు చేసేవారని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి సల్మాన్ మిస్ అయిన రామాయణ రణబీర్ చేజిక్కించుకున్నాడు. మరి ఈ సినిమా అతని కెరీర్ లో ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి.
Kantara chapter 1: ఇది కేవలం సినిమా కాదు. ఇదొక శక్తి..
Vishal - Sai Dhanshika : పెళ్ళి వాయిదాకు కారణం అదేనా...