సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Deepika Padukone: కూతురిని.. ప‌రిచ‌యం చేసిన ర‌ణవీర్, దీపిక! ఎంత క్యూట్‌గా ఉందో

ABN, Publish Date - Oct 21 , 2025 | 10:37 PM

బాలీవుడ్ సూప‌ర్ స్టార్స్ ర‌ణ్ వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా ప‌దుకుణే (Deepika Padukone) ల‌ జంట దీపావ‌ళి (Diwali ) వేడుకుల‌ను వైభ‌వంగా జ‌రుపుకున్నారు.

Deepika Padukone

బాలీవుడ్ సూప‌ర్ స్టార్స్ ర‌ణ్ వీర్ సింగ్ (RanveerSingh), దీపికా ప‌దుకుణే (Deepika Padukone) ల‌ జంట దీపావ‌ళి (Diwali ) వేడుకుల‌ను వైభ‌వంగా జ‌రుపుకున్నారు. ఈ సారి వారి జీవితంలోకి కూతురు దువా (Dua) రావ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు లేవు. త‌న రాక‌తో ఈ సారి వారి ఇంట దివాళీ వేడుక‌లు మ‌రింత ప్ర‌త్యేకంగా మారాయి.

ఈ నేప‌థ్యంలో పండుగ‌ను పుర‌స్క‌రించుకుని ఈ స్టార్ జంట త‌మ కూతురు దువాతో క‌లిసి దిగిన ఫొటోల‌ను సోష‌ల్‌ మీడియాలో షేర్ చేసి త‌మ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్, నెటిజ‌న్స్ దూవా క్యూట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు.

అప్పుడే ఇంత పెద్ద‌గా అయిందా అంటూ ఒకింత ఆశ్య‌ర్యానికి గురౌతున్నారు. అభిమానుల‌కు ది బెస్ట్ గిఫ్ట్ ఇచ్చారంటూ అభినంద‌న‌లు తెలుపుతున్నారు. దువా మ‌రి ఇంత.. క్యూట్‌గా ఉందేంట్రా బాబు మ‌న దిష్టే త‌గిలేలా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మీరూ ఆ ఫొటోల‌పై లుక్కేయండి మ‌రి

Updated Date - Oct 22 , 2025 | 06:55 AM