సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Amar Singh Chamkila : రెండు విభాగాల్లోనూ అవార్డు దక్కలేదు..

ABN, Publish Date - Nov 25 , 2025 | 05:23 PM

పంజాబీ గాయకుడు బాలీవుడ్‌ నటుడు దిల్జీత్‌ దొసాంజ్‌ (Dilji, పరిణీతి చోప్రా (parineeti chopra) ప్రధాన పాత్రల్లో నటించిన ‘అమర్‌ సింగ్‌ చంకీల’ (Amar shing lamkila) చిత్రానికి నిరాశ ఎదురైంది.

పంజాబీ గాయకుడు బాలీవుడ్‌ నటుడు దిల్జీత్‌ దొసాంజ్‌ (Dilji, పరిణీతి చోప్రా (parineeti chopra) ప్రధాన పాత్రల్లో నటించిన ‘అమర్‌ సింగ్‌ చంకీల’ (Amar shing lamkila) చిత్రానికి నిరాశ ఎదురైంది. ఎమ్మీ అవార్డ్స్‌ బరిలో ఇండియా తరఫున పోటీలో నిలిచిన ఈ చిత్రం రెండు విభాగాల్లో పోటీల్లో నిలిచింది. నూయార్క్‌ వేదికగా 23వ అంతర్జాతీయ ఎమ్మీ అవార్డుల (Emmy awards 2025) వేడుక వైభవంగా జరిగింది. ఇందులో ఈ చిత్రం ఏ అవార్డును సొంతం చేసుకోలేదు. దీంతో భారత్‌కుఒక్క అవార్డు కూడా రాలేదు. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో వహించినఈ సినిమా ఉత్తమ మినీ సిరీస్‌, ఉత్తమ నటుడు కేటగిరీలో నామినేషన్‌ దక్కించుకుంది. ఒక్క విభాగంలోనైనా విజయం సాధిస్తుందని ఎదురుచూసిన చిత్ర బృందానికి నిరాశే ఎదురైంది. ఉత్తమ మినీ సిరీస్‌ విభాగంలో ‘లాస్ట్‌ బాయ్స్‌ అండ్‌ ఫెయిరీస్‌’ విన్నర్‌ కాగా, ఉత్తమ హీరోగా ఓరియోల్‌ అవార్డును అందుకున్నారు. 27 ఏళ్ల వయసులోనే హత్యకు గురైన పంజాబీ గాయకుడు అమర్‌సింగ్‌ చంకీల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

Updated Date - Nov 25 , 2025 | 05:25 PM