Dhurandhar: ఔరా 'దురంధరా'.. ఆ పాకిస్థానీ సినిమాను కాపీ కొట్టారా?
ABN, Publish Date - Dec 16 , 2025 | 11:57 AM
ఈనెల మొదటి వారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి అంతకుమించి అనే రీతిలో కలెక్షన్లు కొల్ల గొట్టుతూ బాక్సీపీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది దురంధర్ చిత్రం.
ఈనెల మొదటి వారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చి అంతకుమించి అనే రీతిలో కలెక్షన్లు కొల్ల గొట్టుతూ బాక్సీపీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది దురంధర్ (Dhurandhar) అనే హిందీ చిత్రం. రణ్ వీర్ సింగ్ ఇండియన్ ఏజెంట్‌గా నటించగా అక్షయ్ ఖన్నా (Akshaye Khanna), సంజయ్ దత్ (Sanjay Dutt), అర్జున్ రాంపాల్ (Arjun Rampal) కీలక పాత్రలు చేశారు. గతంలో అర్టికల్ 370, యూరీ సర్జికల్ స్టైక్ వంటి చిత్రాలను రూపొందించిన ఆదిత్య ధర్ (Aditya Dhar) ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు స్వయంగా నిర్మించడం విశేషం. అయితే ఈ చిత్రం రిలీజ్ అయి పది రోజులు కాగా ఇప్పటికే సుమారు 560 కోట్ల రూపాయలు వసూలు చేసి ఈ ఏడాది హయ్యస్ట్ గ్రాసర్ చిత్రాలలో ఒకటిగా పేరు తెచ్చుకోవడమే గాక టాప్ గ్రాసర్‌గా నిలిచేందుకు పరుగులు పెడుతుంది.
ఇదిలాఉంటే.. దీంతో కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా తీసిన ఈ సినిమాను చూసి భారతీయులు సంబర పడుతుంటే పాకిస్థాన్ మాత్రం రుసురుస లాడుతోంది. అందుకు కారణం ఇప్పుడు బాక్సాపీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ఈ దురంధర్ ఓ చిత్రాన్ని కాపీ చేసి తెరకెక్కించారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా పాకిస్తాన్ సినిమానే తస్కరించి ఇక్కడ తీశారని అంటున్నారు. దీంతో ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీంతో అక్కడి కళాకారులు, సినీ ప్రముఖులు‘దురంధర్’ చిత్రం గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇండియన్స్ సైతం వాళ్ల సినిమానే కాపీ చేసి వాళ్లనేకే చుక్కలు చూపిస్తున్నాడంటూ సెటైరికల్‌గా పోస్టులు పెడుతున్నారు.
అయితే.. 2022లో వచ్చిన పాకిస్థానీ చిత్రం ‘చౌదరి అస్లామ్’ (Aslam Chaudhry) ను చూసి ప్రేరణ పొంది ‘దురంధర్’ చిత్రాన్ని తీశారని నటుడు ఖుమర్ రెజా అన్నారు. అస్లామ్ ఓ పోలీస్ ఆఫీసర్, 2014లో ఉగ్రవాదులు జరిపిన కారు బాంబ్ బ్లాస్ట్‌లో ఆయన మరణించారు. ఆయన జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘చౌదరి అస్లామ్’ చిత్రంతో ప్రేరణ పొంది ‘దురంధర్’ సినిమా తీశారని రెజా ఆరోపణ. ‘దురంధర్’ చిత్రంలో సంజయ్ దత్ చౌదరి అస్లామ్ పాత్ర పోషించి ఓ రేంజ్‌లో రక్తి కట్టించడం విశేషం. అయితే.. పాకిస్థాన్ ఏడుపు ఎలా ఉన్నా తిరుగులేని ఆధిక్యంతో దూసుకుపోతోంది ‘దురంధర్’ చిత్రం. విమర్శల్ని పట్టించుకోకుండా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ పార్ట్‌ను మార్చిలో విడుదల చేసేందుకు సిద్ధం చేస్తున్నాడు దర్శకుడు ఆదిత్య ధర్.