సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhurandhar: వెయ్యి కోట్ల క్లబ్‌లో ‘ధురంధర్‌’

ABN, Publish Date - Dec 26 , 2025 | 04:44 PM

రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ఆదిత్యాధర్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది.


రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer singh) హీరోగా ఆదిత్యాధర్‌ (adithya dhar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్‌’. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. ఇప్పుడు వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరి మరో మైలురాయిని చేరుకొంది. ఈ ఏడాది భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా చెప్పవచ్చు, విడుదలైన మొదటి రోజు నుంచీ కలెఞన్ల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ చిత్రం  రూ.1006కోట్లు వసూలు చేసింది. నేటి వరకూ 753 థియేటర్‌లో ఈ సినిమా ఆడుతోంది.

భారత్‌ రూ.668 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్రం బృందం చెబుతోంది. పలు చిత్రాల రికార్డులను ఈ సినిమా క్రాస్‌ చేసింది.  రూ.598 కోట్లు రాబట్టిన స్ర్తీ 2,  రూ.601 కోట్లు కలెక్ట్‌ చేసిన   ఛావా చిత్రాలను క్రాస్‌ చేసి మొదటి స్థానంలోకి వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 19న దీనికి  సీక్వెల్‌ విడుదల కానుంది. బాలీవుడ్‌తోపాటు సౌత్‌లోనూ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.   

Updated Date - Dec 26 , 2025 | 05:00 PM