DHADAK 2: ట్రిప్తి డిమ్రి, సిద్ధార్థ్ చతుర్వేది జోడిగా ‘ధడక్ 2’ ట్రైలర్ విడుదల!
ABN, Publish Date - Jul 13 , 2025 | 07:56 AM
సిద్దార్థ్ చతుర్వేది, ట్రిప్తి డిమ్రి జంటగా దడ్కన్ 2 సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయింది.
బాలీవుడ్‌లో మరో ఆసక్తికర సినిమా రెడీ అవుతోంది. 2018లో జాన్వీ, ఇషార్ కట్టర్ జంటగా వచ్చిన దశాబ్దాల దడక్ (DHADAK) చిత్రానికి సీక్వెల్‌గా ఓ కొత్త కథతో ఇప్పుడు దడక్ 2 (DHADAK 2) అనే సినిమా తయారవుతోంది. గల్లీబాయ్ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ చతుర్వేది (Siddhant Chaturvedi) హీరోగా నటించగా ప్రస్తుత నేషన్ సెన్షేషన్ ట్రిప్తి డిమ్రి (Triptii Dimri) కథానాయికగా చేసింది.
ఈ చిత్రం ఈగస్ట్ 1న థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. జియో స్టూడియో (Zee Studios), కరణ్ జోహర్ ధర్మ ప్రోడక్షన్స్ (Dharma Productions) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించగా షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) దర్శకత్వం వహించాడు.