సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Deepika Padukone: ఆ రీల్‌కు.. 190 కోట్ల వ్యూస్‌

ABN, Publish Date - Aug 06 , 2025 | 02:35 AM

బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్‌ ఇటీవల ఓ హోటల్‌ ప్రచారం కోసం రూపొందించిన యాడ్‌లో నటించారు

Deepika Padukone

బాలీవుడ్‌ నటి దీపికా పడుకోన్‌ ఇటీవల ఓ హోటల్‌ ప్రచారం కోసం రూపొందించిన యాడ్‌లో నటించారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియో(రీల్‌)కు కేవలం 8వారాల్లోనే 190కోట్ల(1.9బిలియన్లు) వ్యూస్‌ వచ్చాయి.

ఇదొక ప్రపంచ రికార్డు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతవరకు మరే వీడియోకు ఇన్ని వ్యూస్‌ రాలేదు. దీంతో, దీపిక ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నారు. 200కోట్ల వ్యూస్‌ మార్క్‌ను అందుకోనున్న మొట్ట మొదటి వీడియోగా ఇది రికార్డులెక్కబోతోందని కామెంట్లు పెడుతున్నారు.

దీపికకు సోషల్‌ మీడియాలో 8కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాగా, హార్దిక్‌ పాండ్యా ‘టేక్‌ ది షాట్‌’ అన్న క్యాప్షన్‌తో పోస్టు చేసిన రీల్‌ 160 కోట్ల(1.6బిలియన్‌) వ్యూస్‌తో రెండో స్థానంలో ఉంది. ఇదిలా ఉండగా, యూట్యూబ్‌లో మాత్రం గంగ్నమ్‌ స్టైల్‌ పాటకు ఇప్పటివరకు ఏకంగా 560కోట్ల(5.6బిలియన్‌) వ్యూస్‌ వచ్చాయి.

Updated Date - Aug 06 , 2025 | 11:46 AM