Zaira Wasim: సినిమాలకు గుడ్ బై.. పెళ్లి చేసుకున్న 'దంగల్' బ్యూటీ
ABN, Publish Date - Oct 19 , 2025 | 07:42 AM
ఆమీర్‌ఖాన్ ‘దంగల్’ చిత్రంలో చిన్న కూతురుగా నటించి గుర్తింపు పొందిన జైరా వసీమ్ వివాహం చేసుకుంది.
ఆమీర్‌ఖాన్ నటించిన దంగల్ (Dangal)చిత్రంలో ఆయన చిన్న కూతురుగా నటించి మెప్పించిన నటి జైరా వసీమ్ (Zaira Wasim). తొలి సినిమాతోనే అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటి అవార్డ్ సైతం పొందింది. ఆ తర్వాత మరో చిత్రం 'సీక్రెట్ సూపర్ స్టార్ లో జైరా నటించింది.
అయితే.. ఆపై మరికొన్ని సినిమాల్లో నటించాలనుకుంది కానీ మతపరమైన కారణాల వల్ల 2019 లోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పేసిన జైరా మళ్లీ ఇప్పుడు వార్త ల్లోకి వచ్చింది.
తనకి పెళ్లయిందని పేర్కొంటూ శుక్రవారం సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టి, రెండు ఫొటోలు షేర్ చేసింది. అయితే తన భర్త వివరాలు మాత్రం ఆమె ఆ పోస్ట్‌లో పేర్కొనలేదు.