సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Battle of Galwan: సల్మాన్‌ఖాన్.. గాల్వాన్ సినిమాపై చైనా అక్క‌సు

ABN, Publish Date - Dec 31 , 2025 | 06:02 AM

సల్మాన్‌ఖాన్.. గాల్వాన్ సినిమాపై చైనా అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌గా భారత్ గట్టిగా బదులిచ్చింది.

Galwan

సల్మాన్‌ఖాన్ (Salman Khan) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గాల్వాన్ ఆఫ్ బ్యాటిల్ (Battle Of Galwan). 2020లో గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనిక దళాలకు మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నారు. సంతోష్ బాబు 16 బిహార్ రెజిమెంట్ కు చెందిన కమాండింగ్ ఆఫీసర్, చైనా (China) సైనిక దళాలతో పోరాడుతూ వీర మరణం పొందారు.

సల్మాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈనెల 27న మేకర్స్ ఈ చిత్రం టీజర్ని విడు దల చేశారు. టీజర్ కు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే చైనా అధికారిక మీడియా 'గాల్వాన్ ఆఫ్ బ్యాటిల్‌ పై చైనా మీడియా అక్కసుసును వెళ్లగక్కింది. 'వినోదం, వాస్తవికత కంటే భావోద్వేగాలతో ఉన్న కథనాలకే బాలీవుడ్ ప్రాధాన్యమిస్తుంది' అంటూ ఆరోపించింది. చైనా సార్వభౌమ భూభాగాన్ని సంరక్షించుకోవాలనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ దృఢ సంకల్పాన్ని, చారిత్రక వాస్తవాలను ఏ సినిమా కూడా బలహీనపరచ లేదు' అంటూ చైనాకు చెందిన ఓ సైనిక నిపుణుడి వ్యాఖ్యలను కూడా గ్లోబల్ టైమ్స్ తన కథనంలో ప్రస్తావించింది.

అయితే ఈ ఆరోపణలను ఇండియా గట్టిగా తిప్పికొట్టింది. 'భారతదేశంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. తమ భావాలను కథల రూపంలో వ్యక్తపర్చడం ఇందులో అంతర్భాగమే. కళాత్మక స్వేచ్ఛకు అనుగుణంగా చిత్రాలను తెరకెక్కించే హక్కు మా దర్శకనిర్మాతలకు ఉంది. ఈ సినిమా విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే స్పష్టత కోసం భారత రక్షణ మంత్రిత్వశాఖను సంప్రదించొచ్చు. ఈ చిత్రం విషయంలో ప్రభుత్వ జోక్యం ఏమీ లేదు అని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Dec 31 , 2025 | 06:02 AM