Katrina Kaif: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా
ABN , Publish Date - Nov 07 , 2025 | 11:26 AM
బాలీవుడ్ మోస్ట్ హాట్‌ఫేవరేట్ జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంట తమ అభిమనులకు గుడ్ న్యూస్ చెప్పింది.
బాలీవుడ్ మోస్ట్ హాట్‌ఫేవరేట్ జంట కత్రినా కైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Vicky Kaushal ) జంట తమ అభిమనులకు గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం ఉదయం కత్రినా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్టు అధికారికంగా ప్రకటించింది.
ఈ విషయం వెళ్లడిస్తూ విక్కీ సోషల్ మీడియాలో ఓ లెటర్ రిలీజ్ చేశారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని అశీస్సులు అందించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ జంట 2021లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.