Celina Jaitly: భర్తపై గృహహింస కేసు పెట్టిన మంచు విష్ణు హీరోయిన్
ABN, Publish Date - Nov 25 , 2025 | 05:04 PM
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ (Celina Jaitly).. తన భర్తపై గృహ హింస కేసు పెట్టడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది.
Celina Jaitly: బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ (Celina Jaitly).. తన భర్తపై గృహ హింస కేసు పెట్టడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. ఆమె తన భర్త పీటర్ హగ్ పై మంగళవారం ఉదయం జ్యూడిషియల్ కోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది. అందులో సెలీనా తన భర్త తనపై గృహ హింసకు పాల్పడ్డాడని, తనను మోసం చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా పీటర్ హాగ్ నుంచి తనకు భరణం కూడా ఇప్పించాలని కోరింది. దాంతోపాటు తన బిడ్డలను కలుసుకొనేవిధంగా చేయాలనీ కోరింది.
పీటర్ ఆస్ట్రియాలో ఉంటున్నాడు. వారి ముగ్గురు పిల్లలు కూడా తండ్రితోనే కలిసి ఉంటున్నారు. పీటర్ తన పిల్లలను కలవనియ్యకుండా చేస్తున్నాడని, కనీసం వర్చువల్ గా అయినా పిల్లలతో మాట్లాడేలా చేయమని వేడుకుంది. అంతేకాకుండా పీటర్ నుంచి తనకు ప్రతి నెల రూ. 10 లక్షలు భరణం.. రూ. 50 కోట్లు పరిహారం ఇప్పించాలని కోరింది. ఇక ఈ పిటిషన్ ను పరిశీలించిన తరువాత పీటర్ కి నోటీసులు జారీచేయనున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించిన విచారణ డిసెంబర్ 12 న జరగనున్నట్లు కోర్టు తెలిపింది.
సెలీనా జైట్లీ.. తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాలో సెలీనా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తరువాత అమ్మడు తెలుగువైపు కన్నెత్తి చూడలేదు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సెలీనా 2011 లో ఆస్ట్రియాకు చెందిన పీటర్ హాగ్ ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. మరి ఈ కేసుపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.