Prem Chopra: ఆస్పత్రిలో చేరిన.. ప్రముఖ బాలీవుడ్ విలన్
ABN, Publish Date - Nov 12 , 2025 | 06:20 AM
బాలీవుడ్ సీనియర్ నటుడు ప్రేమ్ చోప్రా(92) అనారోగ్య కారణాలతో సోమవారం ముంబై లోని లీలావతి ఆస్పత్రిలో చేరారు.
బాలీవుడ్ సీనియర్ నటుడు, విలన్ పాత్రల పోషణలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరచుకున్న ప్రేమ్ చోప్రా(92) (Prem Chopra) అనారోగ్య కారణాలతో సోమవారం ముంబై లోని లీలావతి ( Lilavati Hospital) ఆస్పత్రిలో చేరారు. వైరల్ ఇన్‌ఫెక్షన్, వయసు రీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల ప్రేమ్‌చోప్రా అస్వస్థతకు గురయ్యారనీ, త్వరలోనే ఆయన కోలుకుంటారనీ చికిత్స చేస్తున్న డాక్టర్లు చెప్పారు.
1960-70ల దశకంలో విలన్‌గా ఓ వెలుగు వెలిగారు ప్రేమ్‌చోప్రా. ఆరు పదుల తన నట జీవితంలో ఆయన 380 చిత్రాల్లో నటించారు. సంభాషణలు పలికే తీరు, ఎక్స్‌ప్రెషన్స్‌తో నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న ప్రేమ్‌చోప్రా బాలీవుడ్‌లోని ప్రముఖ విలన్లలో ఒకరిగా వెలిగారు.
‘ఓ కౌన్ థీ’(1954), ‘ఉపాకర్(1967), దో రాస్తే (1969), ‘కటీ పతంగ్’(1970), బాబీ (1973), దో అంజానే (1976), త్రిశూల్ (1978), దోస్తానా (1980) తదితర చిత్రాల్లో ప్రేమ్‌చోప్రా అభినయం ఇప్పటికీ గుర్తుంటుంది.