Shraddha Kapoor: రూ. 252 కోట్ల డ్రగ్ రాకెట్ కేసులో ప్రభాస్ బ్యూటీస్..
ABN, Publish Date - Nov 15 , 2025 | 04:58 PM
రూ. 252 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో బాలీవుడ్ తారలు శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), నోరా ఫతేహి (Nora Fatehi)పేర్లు వినిపించడం సంచలనంగా మారింది.
Shraddha Kapoor: సినిమా ఇండస్ట్రీ - డ్రగ్స్ రాకెట్ కి విడదీయరాని అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. ప్రతిసారి డ్రగ్స్ కేసులో ఎక్కువ సినీ సెలబ్రిటీల పేర్లే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. తాజాగా రూ. 252 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసులో బాలీవుడ్ తారలు శ్రద్దా కపూర్ (Shraddha Kapoor), నోరా ఫతేహి (Nora Fatehi)పేర్లు వినిపించడం సంచలనంగా మారింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం దుబాయ్ లో ఇచ్చిన డ్రగ్స్ పార్టీకి ఈ ఇద్దరు హీరోయిన్లు హాజరయ్యినట్లు సమాచారం అందడంతో ముంబై పోలీసులు అప్రమత్తమై విచారణ చేపట్టారు.
ప్రస్తుతం ముంబై పోలీసులు రూ. 252 కోట్ల డ్రగ్స్ రాకెట్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్ రాకెట్‌కు సంబంధించి ముంబై మరియు దుబాయ్‌లలో అనేక పార్టీలు జరిగినట్లు సమాచారం. ఈ పార్టీలను దావూద్ ఇబ్రహీం సహచరుడు సలీం డోలాకు సన్నిహితుడు అయిన మొహమ్మద్ సలీం, మొహమ్మద్ సుహైల్ షేక్ నిర్వహించారు. ఈ పార్టీలకు శ్రద్దా, ఆమె సోదరుడు సిద్ధాంత్ కపూర్, నోరా, ఓర్రీ, దర్శక ద్వయం అబ్బాస్ మస్తాన్, దివంగత రాజకీయ నాయకుడు బాబా సిద్ధిక్ కుమారుడు జీషన్ సిద్ధిక్ తదితరులు హాజరయ్యినట్లు తెలియడంతో వారిని పోలీసులు విచారించడానికి సిద్దమైనట్లు సమాచారం.
ఇక ఈ కేసలో తన పేరు రావడంతో నోరా ఫతేహి స్పందించింది. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు తనపై చేస్తే ఊరుకొనేది లేదని మండిపడింది. ' నేను ఎలాంటి పార్టీలకు వెళ్ళలేదు. ఫ్లైట్స్ లోనే తిరుగుతున్నాను. నాకు వర్క్ ముఖ్యం.. నాకంటూ పర్సనల్ లైఫ్ కూడా లేదు. అలాంటి పార్టీలు చేసుకొనేవారితో అసలు కలవను. నాకు సమయం దొరికితే కుటుంబంతో కలిసి ఉంటాను.. దుబాయ్ లో బీచ్ ఒడ్డున.. లేక నా స్కూల్ ఫ్రెండ్స్ ఇళ్లలో ఉంటాను. నా లక్ష్యం కోసం పగలు, రాత్రి కష్టపడుతున్నాను. మీరు చదివిన ఏది నమ్మొద్దు. నా పేరు ఈజీ టార్గెట్ గా మారిపోయింది. అంతకుముందు కూడా ఇలాగే వచ్చింది. ఈసారి అలా జరగడానికి నేను అనుమతించను. అబద్దాలు చెప్పి నన్ను నాశనం చేయాలనుకుంటే అది జరగదు. అందరూ నా పేరును దూషించడానికి, నా ప్రతిష్టను దెబ్బతీయడానికి ,నన్ను క్లిక్‌బైట్‌గా ఉపయోగించడానికి తమ వంతు ప్రయత్నం చేయడం నేను సైలెంట్ గా చూస్తూనే ఉన్నాను. నాకు సంబంధం లేని వాటిలో నా పేరును, ఫోటోను ఉపయోగించడం ఇక ఆపండి. దీనికి మీరు చాలా ఎక్కువ చెల్లించాల్సివస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.
అయితే నోరా అయినా దీనిపై స్పందించింది కానీ, శ్రద్దా మాత్రం ఇప్పటివరకు నోరు విప్పలేదు. దీంతో ఆమెపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఇకపోతే ఈ ఇద్దరు భామలు ప్రభాస్ తో నటించడం విశేషం. ప్రభాస్ సరసన నోరా.. బాహుబలిలో నటించింది. మనోహరి సాంగ్ తోనే ఆమె ఫేమస్ అయ్యింది. ఇక శ్రద్దా టాలీవుడ్ ఎంట్రీ ప్రభాస్ సాహోతోనే ఇచ్చింది. మరి శ్రద్దా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.