Manchu Vishnu: మరో వివాదానికి తెరలేపిన మంచు విష్ణు..
ABN , Publish Date - Jun 23 , 2025 | 07:30 PM
తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ప్రస్తుతం విష్ణు నటించిన చిత్రం కన్నప్ప (Kannappa). ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Manchu vishnu: మంచు కుటుంబానికి వివాదాలు కొత్తేమి కాదు. నిజం చెప్పాలంటే వివాదాల్లోనే మంచు కుటుంబం ఉంటుంది. మోహన్ బాబు (Mohan Babu)దగ్గరనుంచి లక్ష్మీ వరకు ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉంటారు. తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) మరో కొత్త వివాదానికి తెరలేపాడు. ప్రస్తుతం విష్ణు నటించిన చిత్రం కన్నప్ప (Kannappa). ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన కన్నప్ప జూన్ 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన విష్ణు.. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మంచు విష్ణు.. తన భార్య వెరోనికా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. విష్ణు- వెరోనికా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వెరోనికా క్రిస్టియన్. అయినా కూడా విష్ణు ప్రేమను అంగీకరించి మోహన్ బాబు వారి పెళ్లిని ఘనంగా జరిపించాడు. వీరికి నలుగురు పిల్లలు. అరియనా- వివియానా కవల పిల్లలు కాగా.. వీరి తరువాత అవ్రమ్ అనే బాబు.. చివరగా ఆర్య విద్య అనే పాప ఉన్నారు. మంచు విష్ణు కన్నా వెరోనికానే ఎక్కువ సంపాదిస్తుంది. ఆమెకు విదేశాల్లో ఒక దుస్తుల కంపెనీ ఉంది.
తాజాగా మంచు విష్ణు.. తన భార్య క్రిస్టియన్ అని, తాన హిందూ అని, ఎవరి నమ్మకాలు వారివి అని చెప్పుకొచ్చాడు. ' నేను పక్కా హిందూ. నా భార్య క్రిస్టియన్. తను రోజు ప్రార్థన చేసుకుంటుంది. బైబిల్ ను ప్రతి రాత్రి బెడ్ కింద పెట్టి పడుకుంటుంది. అలా చేస్తే నాలో ఉన్నదెయ్యాలు పోతాయని ఆమె నమ్ముతుంది. దేవుడు ప్రతిచోటా ఉంటాడు. మీరు దేవుడితో మాట్లాడాలి అనుకుంటే మనసుతో కమ్యూనికేట్ చేయాలి. కచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. దానికోసం దేయాలయాలకు వెళ్లనవసరం లేదు. మీకు మనశ్శాంతీ కావాలనుకుంటే మాత్రం అక్కడకు వెళ్ళాలి. కొన్ని కొన్ని ఆలయాలలో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విష్ణు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
కన్నప్ప రిలీజ్ దగ్గరలో పెట్టుకొని మంచు విష్ణు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని కొందరు చెప్పుకొస్తున్నారు. కన్నప్ప మొత్తం హిందుత్వం మీదనే ఉంటుంది. ఇప్పుడేమో విష్ణు.. దేవుడు ప్రతిచోటా ఉంటాడు. ఆలయాలకు వెళ్లనవసరం లేదు. నా భార్య క్రిస్టియన్ అని చెప్పడంతో పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలో కాంట్రవర్సీ చేయడానికే విష్ణు మాట్లాడుతున్నాడని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడవరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.